- Telugu News Photo Gallery Monsoon Car Care Tips: Don't make this mistake if your car gets stuck in rain water, Do this remedy to prevent damage
Monsoon Car Care Tips: వర్షంలో కారు ఆగిపోతే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. జాగ్రత్త పెద్ద నష్టం జరగొచ్చు..
వర్షం కురుస్తున్నప్పుడు కారులో జాగ్రత్తగా ప్రయాణించడమే కాదు.. కారుకు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వర్షాల కారణంగా ప్రకృతి వికసిస్తుంది. చుట్టూ అందమైన దృశ్యాలు కనిపిస్తాయి. కానీ అధిక వర్షం అనేక సమస్యలను తెస్తుంది. వర్షాకాలంలో చాలా కార్లు వర్షపు నీటిలో చిక్కుకుపోతాయి. అటువంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రిపోర్టులో మీరు తెలుసుకోవచ్చు..
Updated on: Aug 03, 2023 | 9:31 AM

వర్షపు నీటితో నిండిన ప్రదేశంలో కారు చిక్కుకున్నప్పుడు.. ఎయిర్ ఫిల్టర్, ఎగ్జాస్ట్ పైపు ద్వారా నీరు కారులోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ముందుగా కారు ఇంజిన్‌ను ఆపేయాలి. కారును నీటిలో ఉన్నప్పుడు ఎప్పుడూ స్టార్ట్ చేయకూడదు. ఇది ఇంజిన్‌లోకి నీరు వచ్చేలా చేస్తాయి. కారుకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది.

ముందుగా బ్యాటరీ కనెక్షన్‌ని డిస్‌కనెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీ కారు ఎలక్ట్రికల్ వైర్లు, విడిభాగాలు రక్షించబడతాయి. షార్ట్ సర్క్యూట్ వంటి ఏదైనా సంఘటన నుంచి కారును రక్షించడానికి ఇది సహాయపడుతుంది.

కారును స్టార్ట్ చేయకుండానే కారును తరలించడానికి ప్రయత్నించండి. మీకు దగ్గరగా ఎవరైన ఉంటే వారి సహాయం తీసుకుని కారును ఎత్తైన ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నించండి.

ఇంజిన్ ఆయిల్, కూలెంట్‌లోని నీరు, బురద, ధూళి ఇంజిన్‌ను దెబ్బతీస్తాయి. కాబట్టి నీటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయిల్, కూలెంట్ మార్చండి. ఆ తర్వాతే కారుని స్టార్ట్ చేయండి.

అవసరమైతే, ఆయిల్ గేజ్‌ని తనిఖీ చేసి.. సర్వీస్ స్టేషన్‌కు తీసుకెళ్లండి. వర్షం నీటి కారణంగా నిలిచిపోయిన కార్లలోని డీజిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఇంజిన్ ఫ్లష్, ఆయిల్ ఫిల్టర్‌లను తనిఖీ చేయండి.




