- Telugu News Photo Gallery Add custard apples to your diet to get rid of seasonal infections and for health of Heart
Custard Apple: సీతాఫలంతో ఆ ప్రాణాంతక వ్యాధికి చెక్.. ముఖ్యంగా మీ చిట్టి గుండెకు ప్రయోజనం..
Custard Apple: ఆరోగ్య పరిరక్షణ కోసం నిత్యం పండ్లను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. వాటితో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందడంతో పాటు సమస్యలను నివారించవచ్చు. ఎందుకంటే పండ్లలో మానవ శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాంటి పండ్లలో సీతాఫలం కూడా ఒకటి. సీతాఫలం తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Updated on: Aug 03, 2023 | 11:25 AM

Custard Apple: సీతాఫలంలో మానవ శరీరానికి అవసరైమన విటమిన్స్, మినరల్స్, ఇతర ప్రయోజనకర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా సీతాఫలం మన ఆరోగ్యాన్ని రక్షించగల శక్తిని కలిగి ఉంటుంది.

సీతాఫలంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మన శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.

అలాగే ఫైబర్‌ని ఎక్కువగా కలిగిన ఈ ఫలాలు శరీర జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి.. మలబద్దకం, అజీర్తి, కడుపు మంట వంటి జీర్ణ సంబంధ వ్యాధులను నివారిస్తాయి.

ఇంకా సీతాఫల్‌లోని అసిమైసిన్, బులాటాజిమ్ అనే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి. ఫలితంగా శరీరంలో ఏవైనా క్యాన్సర్ కణాలు ఏర్పడినా వాటిని నివారిస్తాయి.

ఇవే కాక ఈ పండ్లలో మెగ్నిషియం, పోటాషియం వంటి మినరల్స్ కూడా ఉన్నందున ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. అదనంగా గుండె సంబంధింత సమస్యలను నిరోధిస్తాయి.




