Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెక్సికోలోని ‘ఏలియన్స్ బాడీ’లపై స్పందించిన నాసా..! ‘పరీక్షలు జరిపాక చెప్తాం, కానీ’ అంటూ..

యూఏపీ పరిశోధన గురించి సాధారణ ప్రజలకు కూడా అవగాహన పెంచేందుకు ప్రయత్నించాలన్న విజ్ఞప్తుల నేపథ్యంలోప్రత్యేకంగా కమిటీ వేసినట్లు ప్రకటించింది. ఈ కమిటీకి డైరెక్టర్‌గా ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ ఆస్ట్రోఫిజిక్స్ డిపార్ట్మెంట్ మాజీ హెడ్ డేవిడ్ స్పెర్గల్‌ను నియమించింది. డేవిడ్ స్పెర్గల్ నాసా తాజా రిపోర్టు విశేషాలను సెప్టెంబర్‌ 14న మీడియాతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే మెక్సికోలో గ్రహాంతరవాసుల అవశేషాలపై మీడియా ప్రశ్నించగా.. పరీక్షలు జరిపాకే అవేమిటో చెప్పగలమని, కానీ వాటికి సంబంధించి ఎలాంటి నమూనాలు తమ వద్ద అందుబాటులో లేవని..

మెక్సికోలోని ‘ఏలియన్స్ బాడీ’లపై స్పందించిన నాసా..! ‘పరీక్షలు జరిపాక చెప్తాం, కానీ’ అంటూ..
Alien Bodies exhibited in Mexico
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 15, 2023 | 12:26 PM

గ్రహాంతర వాసుల అవశేషాలంటూ సెప్టెంబర్ 11న మెక్సికో పార్లమెంట్‌లో ప్రదర్శించిన శిలాజాలపై తాజాగా నాసా తాజాగా స్పందించింది. మెక్సికోలో ప్రదర్శించిన శిలాజాలకు సంబంధించి తమ వద్ద ఎలాంటి శాంపుల్స్ అందుబాటులో లేవని, పరీక్షలు జరపకుండానే అవేమిటో చెప్పలేమని తెలిపింది. ఇలాంటి అసాధారణ వస్తువులు, ఇతర ఆబ్జెక్ట్స్ వంటివాటిని గుర్తించినపుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, పరిశోధకులకు నమూనాలు పంపించాలని నాసా యూఏపీ డైరెక్టర్ డేవిడ్ స్పెర్గల్ కోరారు. అసాధారణ విషయాల్లో పూర్తి పారదర్శకంగా ఉండాలని, మెక్సికో జర్నలిస్ట్ జోస్ జైమ్ మౌసాన్ చెబుతున్న గ్రహాంతరవాసుల అవశేషాలకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో చూడడమే తప్ప ఇతర విషయాలేమి తనకు తెలియవని, అందుకే వేంటనే శిలాజలపై స్పందించలేమని వివరించారు.

గుర్తు తెలియని ఎగిరే పళ్లెంగా వ్యవహరించే అన్‌ఐడెంటిఫైడ్ అనోమోలస్ ఫెనామెనన్‌లపై నాసా తాజాగా ఓ కొత్త రిపోర్టును విడుదల చేసింది. దీనిలో సాధారణ ప్రజలకు అవగాహన పెంచేందుకు ప్రయత్నించాలన్న విజ్ఞప్తుల నేపథ్యంలో యూఏపీ(అన్ ఐడెంటిఫైడ్ అనోమోలస్ ఫెనామెనన్) పరిశోధన కోసం ప్రత్యేకంగా కమిటీ వేసినట్లు ప్రకటించింది. ఈ కమిటీకి డైరెక్టర్‌గా ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ ఆస్ట్రోఫిజిక్స్ డిపార్ట్మెంట్ మాజీ హెడ్ డేవిడ్ స్పెర్గల్‌ను నియమించింది. డేవిడ్ స్పెర్గల్ నాసా తాజా రిపోర్టు విశేషాలను సెప్టెంబర్‌ 14న మీడియాతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే మెక్సికోలో గ్రహాంతరవాసుల అవశేషాలపై మీడియా ప్రశ్నించగా.. పరీక్షలు జరిపాకే అవేమిటో చెప్పగలమని, కానీ వాటికి సంబంధించి ఎలాంటి నమూనాలు తమ వద్ద అందుబాటులో లేవని పేర్కొన్నారు.

కాగా, సెప్టెంబర్ 11న పలువురు శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసుల భౌతికకాయాలుగా భావిస్తున్న రెండు వింత ఆకారాలను నేరుగా పార్లమెంటుకు తీసుకొచ్చి, వాటిని సభలో ప్రదర్శించారు. 2017లో పెరూలోని నజ్కా ఎడారిలో జరిపిన తవ్వకాల్లో ఇవి బయటపడినట్టు తెలిపారు.ఇంకా తమ పరిశోధనలో వెలుగు చూసిన విషయాలను పార్లమెంటుకు నివేదించేందుకు ఆ వింత ఆకారాలను ఇక్కడకు తీసుకొచ్చామని వారు వివరించారు. మరోవైపు జోస్ జైమ్ మౌసాన్ అనే మెక్సికన్ జర్నలిస్ట్ మాట్లాడుతూ.. పార్లమెంట్ సభలో ప్రదర్శించిన రెండు ఆకారాలు మానవులవి కావని డీఎన్ఏ పరీక్షల్లోనూ తేలిందని, కనుక గ్రహాంతర వాసులు ఉన్నారనడానికి ఇవే నిదర్శనమని వివరించారు. ఇదిలా ఉండగా గ్రహాంతర వాసులు ఉన్నారంటూ పార్లమెంటు సభ్యుల ముందు వాంగ్మూలాలు అందజేయడం ఇదే తొలిసారి అయితే కానే కాదు. గతంలో అమెరికా, జపాన్, బ్రెజిల్ పరిశోధకులు కూడా ఇదే విధమైన ప్రదర్శనలు చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..