AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ దేశంలో ’39 నెంబర్’ వద్దంటే వద్దంటున్నారు.. అందుకోసం లంచాలు కూడా ఇస్తున్నారు.. ఎందుకో తెలుసా..

అఫ్ఘానిస్థాన్ దేశ వాసులు 39 నెంబర్ తమకు ఇవ్వొద్దంటూ ఆర్టీఏ ఆఫీసర్లను వేడుకుంటున్నారు. అంతేకాకుండా లక్షల రూపాయల లంచాలు ఇచ్చి మరీ

ఆ దేశంలో '39 నెంబర్' వద్దంటే వద్దంటున్నారు.. అందుకోసం లంచాలు కూడా ఇస్తున్నారు.. ఎందుకో తెలుసా..
uppula Raju
|

Updated on: Jan 23, 2021 | 7:25 PM

Share

అఫ్ఘానిస్థాన్ దేశ వాసులు 39 నెంబర్ తమకు ఇవ్వొద్దంటూ ఆర్టీఏ ఆఫీసర్లను వేడుకుంటున్నారు. అంతేకాకుండా లక్షల రూపాయల లంచాలు ఇచ్చి మరీ ఆ నెంబర్ వద్దంటున్నారు. కొంతమంది ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవడం స్టేటస్‌గా భావిస్తారు. ఇంకొందరు ఆ సంఖ్య వల్ల తమకు అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. మరికొందరు సెంటిమెంట్ కోసం లక్కీ నెంబర్స్ కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలో కొన్నిసార్లు కారు కంటే ఆ కార్ నెంబర్‌కే ఎక్కువ ఖర్చు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అఫ్ఘానిస్థాన్ దేశ వాసులు మాత్రం39 నెంబర్ తమకు ఇవ్వొద్దంటూ ఆర్టీఏ ఆఫీసర్లను వేడుకుంటున్నారు. అసలు వాళ్లు ఆ నెంబర్‌ ఎందుకు వద్దంటున్నారంటే..

అప్ఘాన్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న హెరట్ అనే సిటీలో వ్యభిచార గృహాలను నిర్వహించే ఓ వ్యక్తికి 39 అనే నెంబర్ అదృష్ట సంఖ్య. ఆ సంఖ్యనే తన కార్ నెంబర్లకు ఉపయోగించుకునేవాడు. దీంతో అతడిని అందరూ ‘39’ గా పిలిచేవారు. ఆ నెంబర్ గల కారులో ఎవరైనా ప్రయాణిస్తే, ఆకతాయిలు ఆ కారు వెంటపడుతూ వ్యంగ్యమాటలతో దూషించడం, అవమానించడం చేసేవాళ్లు. ఈ కారణంగా హెరట్ నగరంలోని ప్రజలు ఆ నెంబర్ ఉన్న కారులో వెళ్లడానికే జంకేవారు. ఈ విషయం కాస్త దేశమంతా వ్యాపించి, ఆ నెంబర్ కార్లలో ప్రయాణిస్తున్నారంటే వారిని వ్యభిచారులుగా అనుకోవడం మొదలైంది. దాంతో ‘39’ సంఖ్య అప్ఘాన్‌ దేశవాసులకు ఓ పీడకలలా మారింది. ఆ భయంతో 39 నెంబర్‌ ఉన్న ఫోన్ నెంబర్లు కూడా వాడటం మానేశారు. ఈ క్రమంలో ‘39’ నెంబర్ ఇవ్వొద్దని ఆర్టీఏ అధికారులకు వినతులు రావడం, ఒకవేళ ఒప్పుకోకపోతే ఆ సంఖ్య తమకు కేటాయించకుండా ఉండటానికి అధికారులకు లంచాలు ఇవ్వడం మొదలెట్టారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ‘39’ సంఖ్యను కలిగి ఉన్న లైసెన్స్ ప్లేట్లను రిటైర్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Yadadri works: చివరి దశకు చేరుకున్న యాదాద్రి ఆలయ పనులు.. భక్తుల దర్శనానికి అనుమతి ఎప్పుడో తెలుసా..

ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ
రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌
రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌