AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mysterious Nagenahalli Village: ఆ గ్రామంలో పాము కరిచినా ఏమీకాదు.. పొలిమేర దాటితే మరణం.. సైన్స్ కు అందని మిస్టరీ నాగేన హళ్లి

ఆ గ్రామంలో ప్రజలు, పాములు కలిసి జీవిస్తారు. ప్రతీఇంటికీ గుట్టలుగుట్టలుగా పాములు ఉంటాయి. అవి కరిచినా వారికి ఏమీ కాదు.ఈ వూరి రహస్యమేంటో ఇప్పటి వరకూ సైన్ కు అందని మిస్టరీగా ...

Mysterious Nagenahalli Village: ఆ గ్రామంలో పాము కరిచినా ఏమీకాదు.. పొలిమేర దాటితే మరణం.. సైన్స్ కు అందని మిస్టరీ నాగేన హళ్లి
Surya Kala
|

Updated on: Jan 23, 2021 | 5:03 PM

Share

Mysterious Nagenahalli Village: పాము అంటేనే భయం.. అది ఏరకమైన జాతిదైనా భయం కలుగుతుంది.. ఇక అదే తాచు పాము పేరు చెబితే.. దానిని మన ప్రక్కన్న చూస్తే.. వెన్నులోనుంచి వణుకు మొదలవుతుంది. మరి అలాంటి తాచుపాములతో మనుషులు కలిసి సహజీవనం చేస్తే.. ఆలోచనే షాక్ కలిగిస్తుంది కదా..! కానీ ఇది నిజం.. కర్ణాటక రాష్ట్రంలో దావణగిరి జిల్లాలో పంచాయత్ పట్టణానికి దగ్గరగా నాగేన హళ్లి అనే గ్రామంలో ప్రజలు, పాములు కలిసి జీవిస్తారు. ప్రతీఇంటికీ గుట్టలుగుట్టలుగా పాములు ఉంటాయి. అవి కరిచినా వారికి ఏమీ కాదు.ఈ వూరి రహస్యమేంటో ఇప్పటి వరకూ సైన్ కు అందని మిస్టరీగా మిగిలిపోయింది.

నాగేన హళ్లి అంటే తాచుపాముల గ్రామం అని అర్ధం.. కాగా ఈ గ్రామంలో ఎవరైనా ఒకవేళ కాటుకు గురైతే.. అలా సర్పం చేత కరవబడ్డ వారిపై ఆ విషం పనిచేయదు. ఆ గ్రామంలో ఉన్నంత వరకూ వారికి ఏమీ కాదు.. కానీ ఏ కారణం చేతనైనా పాము కాటుకు గురైన వాళ్ళు ఆ వూరు పొలిమేర దాటి వెళ్ళితే.. వెంటనే మరుక్షణం మరణిస్తారు… పాము విషయం ఆ గ్రామంలో ఉన్నంత వరకూ ఎందుకు పనిచేయదో.. ఇప్పటి వరకు అనేక మంది శాస్త్రజ్ఞులు పరిశోధలు చేశారు. అలా ఎందుకు జరుగుతుందో కొమ్ములు తిరిగిన సర్పశాస్త్రజ్ఞులకు కూడా అర్థం కాలేదు.

ఆ గ్రామంలో పాము కరవడం చాలా అరుదుగా జరిగే సంఘటన.. ఒక వేళ ఆ గ్రామంలో ఎవరికైనా సర్పం కరిస్తే.. ఆ పాముని తీసుకొని వెళ్ళి ఆ ఊరి స్మశానంలో ఉన్న యతీశ్వర మండపం వద్ద ఉంచుతారు.. వెంటనే ఆ గ్రామంలో ఉన్న హనుమాన్ ఆలయంలోకి వెళ్ళి… స్వామివారి తీర్ధం తీసుకొని మర్నాడు ఉదయం వరకూ ఆ గుడిలో నిద్ర పోకుండా ఉండిపోతారు.. అనంతరం వారికి ఎక్కిన విషం నిర్వీర్యం అయి క్షేమంగా బయటపడతారు.

ఈ గ్రామంలో ఇలా జరగడానికి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది…

ఒకప్పుడు ఈ గ్రామంలో యతీశ్వర స్వామి అనే సాధువు నివసించేవారట.. ప్రతి రోజూ ఉదయం గామంలో ఇంటింటికి వెళ్ళి బిక్షమ్ ఎత్తుకొని హనుమాన్ గుడి పరిసరాల్లో విశ్రాంతి తీసుకొంటూ ఉండేవారట.. ఒక రోజు ఆయన బిక్షం ఎత్తుకొని తిరిగి హనుమాన్ గుడికి వస్తుండగా.. ఒక చోట పొదల మధ్య పడి ఉన్న శిశువును చూశారు.. అనాధగా పడి ఉన్న ఆ బిడ్డను సాధువు చేరదీశారు.. బిడ్డను పెంచి పెద్దచేయడం ప్రారంభించారు. కాలచక్రంలో 12 ఏళ్ళు గడిచాయి.. ఆ మగబిడ్డకు 12 ఏళ్ళు నిండాయి. రోజూలా సాధువు పిల్లవాడిని గుడి దగ్గర విడిచి బిక్షం ఎత్తుకోవడానికి ఊర్లోకి వెళ్లారు. బిక్ష తీసుకొని తిరిగి హనుమాన్ గుడికి వచ్చేసరికి పాము కాటుకి గురై మరణించిన తన పెంపుడు కొడుకు కనిపించాడు. తన పెంపుడు బిడ్డ అకాల మృత్యువు కలిగించిన సర్పం మీద ఆ సాధువుకు విపరీతమైన ఆగ్రహం కలిగింది.

తపస్సంపన్నమైన ఆ సాధువు ఆగ్రహంతో నాగరాజుని శపించడానికి యత్నించాడు. ఈ విషయం పసిగట్టిన నాగరాజు కన్నుమూసి తెరిచేలోగా తన పరివారం తో సహా పాతాళలోకం నుంచి సాధువు ఉన్న ప్రాంతానికి వచ్చి.. సాధువు ని క్షమించమని వేడుకొన్నాడు. అంతేకాదు.. పాముకతుకు గురైన ఆ బిడ్డను బతికించాడు. దీంతో సాధువు శాంతించి ఇకపై గ్రామంలో నివశించే వారి మీద లేదా.. గ్రామంలో ఉన్న వారిపై ఏ విధమైన సర్పం విషయం పనిచేయదని.. గ్రామం దాటితే పాము విషం పనిచేస్తుంది అని చెప్పారు..

నాగరాజు సాధువు చెప్పిన షరతుకు అంగీకారం తెలిపాడు.. అనంతరం ఆ సాధువు ఆ గ్రామ సరిహద్దులపై 4 బండ రాళ్ళను పాతి వాటి పై ఆయనే స్వయంగా ఇలా చెక్కాడు. ఆ నాలుగురాళ్ల సరిహద్దులపై ఉండే నాగేనహళ్లి గ్రామంలో ఉన్నంతవరకు సర్పం తో కరవడిన ఏ వ్యక్తి కీ ప్రాణహాని జరగదు.. సర్పం కరచిన వారు గ్రామం దాటితే మరణం తప్పదు.. ఇప్పటికీ ఆ యతీశ్వర స్వామి పాతిన నాలుగు సరిహద్దు బండరాళ్ళు యధాతధంగా నిలిచి ఉన్నాయి.

అంతేకాదు.. ఈ గ్రామంలో నివశించే ప్రజలకు సాధువు కొన్ని నియమాలు ఏర్పాటు చేశాడు.. గ్రామంలో ప్రజలు మాంసాహారం భుజించరాదు.. సర్పాలను చంపరాదు.. ఒక వేల తెలిసిగానీ, తెలియక గానీ ఈ నియమాలను అతిక్రమిస్తే.. తీవ్ర పరిమాణాలను ఎదుర్కోవలసి వస్తుంది అని ఆ సాధువు చెప్పాడట.. ఐతే ఈ యతీశ్వర స్వామి ఏ శతాబ్ధానికి చెందిన వాడో తెలియదు కానీ సాధువు కథ ఒక తరం నుంచి మరో తరానికి అందుతూనే ఉన్నది.. ఈ గ్రామం లో 70 వరకూ ఇల్లు ఉంటాయి.. ఆ గ్రామంలో ఇళ్లలోనూ, తోటల్లోనూ, పొదల్లోనూ, తాచుపాములు స్వేచ్ఛగా సంచరిస్తాయి.. ఆ పాములను తమ పెంపుడు జంతువుల్లా భావిస్తూ ఆ గ్రామస్థులు తమ పని తాము చేసుకుని పోతుంటారు.

Also Read: ప్రజల ప్రాథమిక హక్కులను, బాధ్యతలను తెలియజేసే రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటామో తెలుసా..!