AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలియకుండానే ప్రాణాలను హరిస్తున్న మహమ్మారి.. బీపీ లెక్కలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు ఇవే.. ఇంత ఉంటే సాధారణమే అంటా..

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా..చాలా మంది రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. తెలియకుండానే ఈ సమస్యను ఎదుర్కోంటున్న

తెలియకుండానే ప్రాణాలను హరిస్తున్న మహమ్మారి.. బీపీ లెక్కలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు ఇవే..  ఇంత ఉంటే సాధారణమే అంటా..
Blood Pressure
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 31, 2021 | 9:38 AM

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా..చాలా మంది రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. తెలియకుండానే ఈ సమస్యను ఎదుర్కోంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా.. రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యాధి భారీన పడి ప్రాణాలు పొగొట్టుకుంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. ఇప్పటి వరకు రక్తపోటు 120/80 ఎంఎంహెచ్‌జీ (మిల్టీమీటర్స్ ఆఫ్ మెర్క్యురీ) గా ఉంటే సాధారణంగా పరిగణించేవారు. అది దాటితే రక్తపోటు ఉన్నట్టుగానే భావించేవారు. అయితే ప్రస్తుతం ఈ లెక్కల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం రక్తపోటు సమస్యను ఎదుర్కోంటున్న వారు అధికంగా ఉండడం కాస్తా ఆందోళన కలిగిస్తోంది. ఇక నుంచి 140/90 లోపు ఉంటే దానిని  సాధారణంగానే పరిగణిస్తారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.

డయస్టాలిక్ (హృదయ వ్యాకోచం), సిస్టోలిక్ (హృదయ సంకోచ సమయంలో గుండె కొట్టుకునే వేగం)‌కు సంబంధించి కొన్ని మార్పులు చేసింది డబ్ల్యూహెచ్ఓ. డయస్టాలిక్ పోటు 90 ఎంఎంహెచ్‌జీ, అంతకుమించి రెండు రోజులపాటు ఉంటేనే దానిని రక్తపోటుగా పరిగణించాలని డబ్ల్యూహెచ్ఓ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే ధూమపానం, మద్యం అలవాటు, ఒకే చోట అదే పనిగా కూర్చుని పనిచేయడం, రోజుకు కనీసం అరంగట అయినా వ్యాయామం చేయకపోవడం, వంశపారంపర్యంగా బీపీ వచ్చే అవకాశం వారికి, గుండె జబ్బులు ఉన్నవారికి సిస్టోలిక్ పోటు గరిష్ఠంగా 130 ఎంఎంహెచ్‌జీ వరకు ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

ఇప్పటివరకు యావత్ ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని.. వారిలో 14 శాతం మందిలో మాత్రమే బీపీ నియంత్రణలో ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ 21 ఏళ్ల తర్వాత బీపీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయడం చేసింది. అధిక రక్తపోటు బాధితుల్లో దాదాపు 46 శాతం మందికి తమలో ఆ సమస్య ఉన్నట్టు గుర్తించలేరు. అందుకే బీపీని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు. ఈ క్రమంలో 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు తరచూ బీపీని చెక్ చేయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే 40 ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా బీపీని తరచూ పరీక్షించుకుంటూ ఉండాలంచున్నారు నిపుణులు..

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్‏లో కీలక మార్పులు.. కొత్తగా మరో ముగ్గురు..  

Bheemla Nayak: సందడి మొదలైంది.. పవన్ బర్త్ ‏డే అదిరిపోయే సర్‏ప్రైజ్ ప్లాన్ చేసిన భీమ్లా నాయక్ టీం.. ట్వీట్ వైరల్..

బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో
బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో
100 గంటల్లోనే గట్టిగా ఇచ్చేశాడు భయ్యో.. సెహ్వాగ్‌కు దిమ్మతిరిగేలా
100 గంటల్లోనే గట్టిగా ఇచ్చేశాడు భయ్యో.. సెహ్వాగ్‌కు దిమ్మతిరిగేలా
RR మ్యాచ్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గిల్! కారణమిదే
RR మ్యాచ్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గిల్! కారణమిదే
అమరావతే ఫైనల్.. చట్టబద్దతకు పక్కాగా అడుగులు
అమరావతే ఫైనల్.. చట్టబద్దతకు పక్కాగా అడుగులు
మహేష్ బాబుతో భారీ హిట్ అందుకుంది..
మహేష్ బాబుతో భారీ హిట్ అందుకుంది..
రోజంతా ఏసీలో కూర్చుంటున్నారా.. మీ ఆరోగ్యం పెద్ద ఆపదలో ఉన్నట్టే..!
రోజంతా ఏసీలో కూర్చుంటున్నారా.. మీ ఆరోగ్యం పెద్ద ఆపదలో ఉన్నట్టే..!
సమ్మర్ టూర్‎కి వెళ్తున్నారా.? వీటిని తప్పక బ్యాగ్‎లో పెట్టుకోండి.
సమ్మర్ టూర్‎కి వెళ్తున్నారా.? వీటిని తప్పక బ్యాగ్‎లో పెట్టుకోండి.
లైఫ్ ఆఫ్ పై నటి గుర్తుందా.? ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే
లైఫ్ ఆఫ్ పై నటి గుర్తుందా.? ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే
మానవత్వం చాటుకున్న టీజీఎస్ఆర్టీసీ కండక్టర్.. అసలేం జరిగిందంటే..
మానవత్వం చాటుకున్న టీజీఎస్ఆర్టీసీ కండక్టర్.. అసలేం జరిగిందంటే..
సింగర్‌ నేహా సింగ్‌ రాథోడ్‌పై దేశద్రోహం కేసు.. ఇంతకు ఆమె ఎవరు?
సింగర్‌ నేహా సింగ్‌ రాథోడ్‌పై దేశద్రోహం కేసు.. ఇంతకు ఆమె ఎవరు?