Workout Uses: వర్కవుట్లతో కేవలం శారీరక ఆరోగ్యమే కాదు.. మానసిక ఆరోగ్యం కూడా మీ సొంతం. అవేంటంటే..
Workout Uses: సాధారణంగా వ్యాయామాలు చేసేవారు అందమైన శరీర సౌష్టవమే తమ లక్ష్యంగా భావిస్తారు. పొట్ట పెరిగిందనో, లావుగా అయ్యామనే వర్కవుట్ల బాట పడుతుంటారు. అయితే వ్యాయామంతో కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా...
Workout Uses: సాధారణంగా వ్యాయామాలు చేసేవారు అందమైన శరీర సౌష్టవమే తమ లక్ష్యంగా భావిస్తారు. పొట్ట పెరిగిందనో, లావుగా అయ్యామనే వర్కవుట్ల బాట పడుతుంటారు. అయితే వ్యాయామంతో కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుందనే విషయం మీకు తెలుసా.? క్రమం తప్పకుండా వర్కవుట్లు చేయడం వల్ల కలిగే మానసిక ఆరోగ్యాల గురించి ఇప్పుడు చూద్దాం..
* వర్కవుట్లు మొదలు పెట్టగానే మీకు కండలు తిరిగే శరీరం అంత త్వరగా కనిపించదు కానీ.. మీరు మానసికంగా చాలా ధృడంగా మారుతారు. దీనివల్ల మీరు రోజు చేసే పనులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సులభంగా చేసుకోగలుగుతారు.
* ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆందోళన తగ్గుతుంది. రాత్రి పూట ప్రశాంతంగా నిద్ర పడుతుంది. పరిశోధకుల అధ్యయనాల్లో తేలిన వివరాల ప్రకారం.. ప్రతిరోజూ వ్యాయామం చేసిన వారికి ఇన్సోమియాతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. అయితే సాయంత్రం, రాత్రి వ్యాయామాలు చేయడం కంటే ఉదయం పూట చేస్తే మంచి నిద్ర పొందవచ్చు.
* ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్న వారు ప్రతి రోజూ వ్యాయమాన్ని జీవితంలో ఓ భాగం చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కార్టిసోల్ వంటి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మానసిక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
* వ్యాయామం ధీర్ఘకాలంగా వచ్చే డయాబెటిస్‌ను దరిచేరకుండా చూస్తుంది. అలాగే బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది.
Kondapindi Aaku Pappu: కిడ్నీ స్టోన్స్ ను కరిగించే కొండపిండాకు పప్పు కూర తయారీ విధానం