Menstrual Protection: దేశంలో నేటికీ చాలామంది మహిళల్లో రుతుక్రమంపై రాని అవగాహన.. ఆరోగ్యంపై సర్వేలో షాకింగ్ విషయాలు..

Menstrual Protection: దేశంలో నేటికీ చాలామంది మహిళల్లో రుతుక్రమంపై రాని అవగాహన.. ఆరోగ్యంపై సర్వేలో షాకింగ్ విషయాలు..
Sleep

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (NFHS)నివేదిక ప్రకారం 15-24 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 50 శాతం మంది  రుతుక్రమ సమయంలో రక్షణ కోసం వస్త్రాన్ని ఉపయోగిన్నారని తెలుస్తోంది. దీనికారణం ఋతుక్రమంపై సరైన అవగాహన లేకపోవడం, నేటికీ సమయంలో బహిష్టి సమయంలో ఉన్న నిషేధాలు ప్రధాన కారణాలు

Surya Kala

|

May 13, 2022 | 11:24 AM

Menstrual Protection: మన దేశంలో మనిషి ఆధునిక, శాస్త్ర, సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్తున్నా.. ఇంకా సమాజంలో మూఢనమ్మకాలు, పరిస్థితులపై అవగానలేమి కొనసాగుతూనే ఉంది, ముఖ్యంగా మహిళల్లో నెలనెలా వచ్చే రుతుక్రమం విషయంలో వారిలో అవగానలేమి గురించి సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (NFHS)నివేదిక ప్రకారం 15-24 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 50 శాతం మంది  రుతుక్రమ సమయంలో రక్షణ కోసం వస్త్రాన్ని ఉపయోగిన్నారని తెలుస్తోంది. దీనికారణం ఋతుక్రమంపై సరైన అవగాహన లేకపోవడం, నేటికీ సమయంలో బహిష్టి సమయంలో ఉన్న నిషేధాలు ప్రధాన కారణాలు.

భారతదేశంలో 64 శాతం మంది శానిటరీ న్యాప్‌కిన్‌లు, 50 శాతం మంది క్లాత్‌లు, 15 శాతం మంది స్థానికంగా తయారు చేసిన నాప్‌కిన్‌లను ఉపయోగిస్తున్నారని నివేదిక పేర్కొంది. అయితే దేశంలో మొత్తంమీద, స్త్రీలలో 78 శాతం మంది ఋతుక్రమ సమయంలో రక్షణ కోసం పరిశుభ్రమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు. బీహార్ (59 శాతం), మధ్యప్రదేశ్ (61 శాతం), మేఘాలయ (65 శాతం)లో అత్యల్ప శాతం మంది మహిళలు ఋతు రక్షణలో పరిశుభ్రమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు. స్థానికంగా తయారుచేసిన నాప్‌కిన్‌లు, శానిటరీ న్యాప్‌కిన్‌లు, మెన్‌స్ట్రువల్ కప్పులు వంటివి పరిశుభ్రమైన రక్షణ పద్ధతులు.

ఋతుక్రమ సమయంలో మహిళల్లో పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి పూణేలో స్పిరూల్ ఫౌండేషన్‌ను గీతా బోరా ప్రారంభించారు. ఆమె ఇప్పటికీ మన దేశంలో చాల ప్రాంతాల్లో ఋతు పరిశుభ్రత సుదూర కలగా ఉందని చెప్పారు. దీనికి అనేక అంశాలు కారణమని న్యూస్ 9 తో గీతా బోరా చెప్పారు.

గ్రామీణ ప్రాంత కౌమార బాలికల్లో, పాఠశాలల్లో బాలికలకు నెలసరి సమయంలో పరిశుభ్రతను పెంపొందించటం కోసం రుతుక్రమం వేళల్లో వాడేందుకు శుభ్రమైన ప్యాడ్లు, నేప్కిన్లు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుంది. చాలా సమయలలో ఇవి ఎప్పుడూ సకాలంలో పంపిణీ చేయబడవు. తమకు మధ్యాహ్న భోజనాలు అందడం లేదని, శానిటరీ న్యాప్‌కిన్లు పంపిణీ చేయలేదని ఎవరూ గొంతు ఎత్తడం లేదు. ముఖ్యంగా శానిటరీ న్యాప్ కీన్ల విషయంలో గొంతు ఎత్తకపోవడానికి కారణం దాని విషయం చుట్టూ ఉన్న నిషేధం వలన ఇది జరుగుతుంది. బహిష్టు పరిశుభ్రత గురించి ఎవరూ మాట్లాడరని బోరా వివరించారు.

కోవిడ్-19 సమయంలో లాక్‌డౌన్‌లు కూడా ఋతు పరిశుభ్రతకు సంబంధించిన సంక్లిష్ట సమస్యలను ఎదుర్కొన్నారని ఆమె అన్నారు. ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఆర్థిక నిర్వహణ సమస్యగా మారింది. ఖరీదైన శానిటరీ న్యాప్‌కిన్‌లు కొనుగోలు చేయడం మహిళలకు ఆర్ధికంగా భారంగా మారిందని వివరించారు.

“భారతదేశంలో.. మహిళలకు, కుటుంబం మొదటి స్థానం ఉంటుంది. అయితే మహిళలు అవసరాలకు ఎల్లప్పుడూ వారు కుటుబం అవసరాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే ఇస్తారు. మహిళలు మార్కెట్‌లో చౌకగా లభించే శానిటరీ న్యాప్‌కిన్‌లను కొనుగోలు చేయడం లేదా అత్యంత అపరిశుభ్రమైన వస్త్రాన్ని ఉపయోగించడం సర్వసాధారణంగా మారిపోయింది. అలాగే, ఈ చౌకైన శానిటరీ నాప్‌కిన్‌లు లేదా గుడ్డను ఉపయోగించేందుకు మహిళలు ప్రాధాన్యత ఇస్తారు. అయితే రుతుక్రమ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే మాత్రమే న్యాప్‌కిన్‌లను కొనుగోలు చేస్తారు” అని బోరా చెప్పారు.

ఇప్పటికీ గుడ్డను ఉపయోగించడానికి మరొక కారణం, నగరాల్లో శానిటరీ న్యాప్‌కిన్‌ను పారవేయడం సులభం అయితే, గ్రామాల్లో ఇది చాలా పెద్ద పని. “మెన్స్‌ట్రువల్ కప్పులు, టాంపాన్‌లు వంటి శానిటరీ ఉత్పత్తులను ఇప్పటికీ చాలా మంది మహిళలకు ఎలా ఉపయోగించాలో తెలియకపోవడమే మహిళలు ఎదుర్కొనే అవరోధమని వివరించారు. గిరిజన ప్రాంతాల్లో, మహిళలకు శానిటరీ నాప్‌కిన్‌ను ఎలా ఉపయోగించాలో కూడా తెలియదన్నారు బోరా.

రాజధానిలోని ఫార్‌టిస్ ల ఫెమ్మ్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ మీనాక్షి అహుజా మాట్లాడుతూ మహిళలు రుతుక్రమంలో సరైన పరిశుభ్రత పాటించకపోతే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. “రక్తం ఇన్‌ఫెక్షన్‌కి మంచి వాహకం. రుతుక్రమం సమయంలో ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. నాలుగు గంటల కంటే ఎక్కువసేపు శానిటరీ న్యాప్కిన్స్ వాడితే టాక్సిక్‌ షాక్‌ సిండ్రోమ్‌కు దారితీయవచ్చునని చెప్పారు. ముఖ్యంగా స్త్రీలకు వచ్చే పెల్విక్ ఇన్‌ఫెక్షన్ల కూడా రావచ్చని తెలిపారు. యోని చుట్టూ ఫంగస్ వంటివి సాధారణం ఏర్పడతాయని దీంతో యోని ప్రాంతంలో దురద రావచ్చని తెలిపారు. ఇన్ఫెక్షన్ పెరిగేకొద్దీ, ఇది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ (PID)కి దారి తీస్తుంది. ఈ PID వలన గర్భాశయం, గర్భాశయ ముఖద్వారం హాని కలిగిస్తాయి. అంతేకాదు వంధ్యత్వానికి కారణమవుతాయని “డాక్టర్ అహుజా చెప్పారు. కనుక మహిళలలో రుక్రమం పై , ఆ సమయంలో తీసుకోవాల్సిన రక్షణ పద్ధతులపై సంపూర్ణ అవగాన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. (Source)

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu