Winter Tips: చలికాలంలో ఉదయం వాకింగ్‌కు వెళుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదంలో పడినట్లే..
ఉదయాన్నే వాకింగ్ లేదా జాగింగ్‌కు వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యాయామాలు చేసే వారు, క్రీడాకారులు, మార్నింగ్ వాక్ కు వెళ్లే వృద్ధులు చలిలో బయటకు వెళ్లే ముందు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
రుతుపవనాలు ముగిశాయి. శీతాకాలం ప్రారంభమయింది. ఈ సీజన్‌లో చలిగాలులతో పాటు వివిధ రకాల వ్యాధులు మనల్ని ఇబ్బంది పెడతాయి. అలాగే ఫిట్‌నెస్ పరంగా సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే చలి కారణంగా చాలామంది ఉదయాన్ని బయటకు వెళ్లేందుకు ఇష్టపడరు. ఇలా చేయడం వల్ల పలు సమస్యలు తలెత్తుతాయి.కాబట్టి కొన్ని జాగ్రత్తలతో వాకింగ్ తో పాటు శారీరక వ్యాయామాలు చేయడం మేలు. ప్రధానంగా ఉదయాన్నే వాకింగ్ లేదా జాగింగ్‌కు వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యాయామాలు చేసే వారు, క్రీడాకారులు, మార్నింగ్ వాక్ కు వెళ్లే వృద్ధులు చలిలో బయటకు వెళ్లే ముందు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే జలుబు, ఫ్లూ వంటి సాధారణ ఆరోగ్య సమస్యలతో మొదలై చర్మం పగుళ్లు, గుండెపోటు, ఇది శ్వాసకోశ సమస్యలు, న్యుమోనియా, డిప్రెషన్ వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులు తలెత్తుతాయి. ఇక ఈ చలికాలంలో గాయాలు త్వరగా మానవు, అందుకే జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మరి చలికాలంలో వాకింగ్ చేసేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
రెండు పొరల దుస్తులు చలికాలంలో మీ శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించండి. చిరిగిన దుస్తులను ధరించవద్దు. మెడ భాగాన్ని కప్పి ఉంచే సన్నని విండ్ బ్రేకర్ స్టైల్ జాకెట్లు ధరించాలి. మరీ వేడిగా, అసౌకర్యంగా అనిపించినప్పుడు ఈ దుస్తులు తీసేయవచ్చు. ఇక పాదాలకు సాక్స్, చేతులకు గ్లౌజులు, చెవులకు టర్బన్‌లు కూడా ధరించాలి. సరిపడా బూట్లు ధరించండి. ఇక ఏదైనా వ్యాయామం ప్రారంభించే ముందు వార్మ్ అప్ తప్పనిసరి తప్పనిసరి. దీని ముఖ్య ఉద్దేశ్యం శరీర ఉష్ణోగ్రతను పెంచడం. ఇది కండరాల పనితీరును మెరుగుపరుస్త్ఉంది. శరీరాన్ని సౌకర్యవంతంగా కదిలించడానికి కావాల్సిన ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది. తగినంత శరీర ఉష్ణోగ్రత అవయవాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. చలిలో ఇది చాలా ముఖ్యం.
ఖాళీ కడుపుతో కాకుండా..
వ్యాయామం చేయడం వల్ల శక్తి తగ్గుతుంది. అందుకే వ్యాయామానికి ముందు తేలికపాటి అల్పాహారం తీసుకోవాలి. సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్, కార్బోహైడ్రేట్లను తీసుకోవడం ఉత్తమం. కనీసం ఒక పండు తినండి. తద్వారా గ్లైకోజెన్ క్షీణతను నివారించవచ్చు. శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. సాధారణంగా, చలికాలంలో ఎక్కువగా దాహం వేయదు. అలాగనీ నీరు త్రాగకుండా వ్యాయామం చేయడం వల్ల డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. కాబట్టి గోరువెచ్చని నీళ్లతో నిండిన వాటర్ బాటిల్ తీసుకుని మధ్యలో నీళ్లు తాగుతూ ఉండాలి. ఇక ఏదైనా వ్యాయామం చేసేటప్పుడు సరిగ్గా నిద్రపోవడం అలాగే శరీరానికి తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన విశ్రాంతి లేకుండా సాధన చేస్తే అనారోగ్యానికి గురవుతారు. ఆస్తమా లేదా ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుంటే, మీరు మీ మందులను సమయానికి తీసుకునేలా జాగ్రత్త వహించాలి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి