జబ్బులన్నీ పారిపోవాలంటే.. ఈ టీ తాగాల్సిందే..! దీన్ని అస్సలు మర్చిపోకండి..!
లవంగంతో చేసిన టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరాన్ని లోపల నుంచి బలంగా మారుస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. నోటి దుర్వాసన, శ్వాస సమస్యలు తగ్గుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

లవంగం అనేది ప్రతి ఇంట్లో నిత్యం కనిపించే ఒక సాధారణ మసాలా ద్రవ్యమే అయినా.. దీని వల్ల కలిగే ఆరోగ్య లాభాలు విశేషమైనవే. చిన్నదైన ఈ లవంగం శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ లోపల నుంచి శక్తివంతంగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. లవంగంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తుడిచిపెట్టే శక్తిని కలిగి ఉంటాయి. ఫలితంగా కణజాలం మెరుగవుతుంది, శరీరం బలపడుతుంది. నిత్యం జబ్బులు రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది.
జీర్ణ సమస్యలు తరచూ వస్తే ఉదయాన్నే ఖాళీ కడుపుతో లేదా భోజనానంతరం లవంగంతో తయారు చేసిన టీ త్రాగడం మంచిది. ఈ టీ జీర్ణ ప్రక్రియను చక్కబెట్టే పనిలో కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణఎంజైముల ఉత్పత్తిని పెంచడంతో పాటు ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. కడుపులో అసౌకర్యం, నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
భోజనం తర్వాత తిమ్మిరి, గ్యాస్ వంటి ఇబ్బందులు కలిగే వారికి లవంగం టీ బాగా ఉపయోగపడుతుంది. ఇది సహజంగా జీర్ణాశయాన్ని శుభ్రపరచడంతో పాటు శరీరానికి తేలికపరచే పని చేస్తుంది. అందువల్ల అలసట తగ్గిపోతుంది, శక్తి పెరుగుతుంది.
శీతాకాలంలో, వాతావరణ మార్పుల సమయంలో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు రోగనిరోధక శక్తిని పెంచాల్సిన అవసరం ఉంటుంది. లవంగంలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీరాన్ని రక్షించే పనిలో కీలకంగా పనిచేస్తాయి. వైరస్‌లను అడ్డుకుంటాయి, ఇన్ఫెక్షన్ల ప్రభావాన్ని తగ్గిస్తాయి.
గొంతులో నొప్పి ఉన్నప్పుడు లేదా శ్లేష్మం వల్ల శ్వాస సరిగా జరగకపోతే వేడి వేడి లవంగం టీ త్రాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇది శ్వాస మార్గాలను స్వేచ్ఛగా మారుస్తుంది. గొంతు నొప్పి తగ్గిపోతుంది, శ్వాస సులభతరం అవుతుంది.
నోటి ఆరోగ్యానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు లాంటివి చాలా మందికి తరచూ కలుగుతూ ఉంటాయి. లవంగంలో ఉండే ఔషధ గుణాలు ఇలాంటి ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి. దంతాలు బలపడతాయి, నోటి పరిశుభ్రత మెరుగవుతుంది.
లవంగంలో ఉండే మాంగనీస్ మెదడు పనితీరుకు చాలా అవసరం. ఇది నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో, శారీరక చలనం నియంత్రించడంలో దోహదపడుతుంది. ఎముకలు బలంగా మారేందుకు సహాయపడుతుంది. శరీరానికి కావలసిన శక్తిని అందిస్తూ ఉత్సాహాన్ని పెంచుతుంది. ఈ లవంగం టీని అధికంగా త్రాగకూడదు. రోజు ఒకసారి లేదా రెండు రోజులకు ఒక్కసారి త్రాగడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
