సన్నగా నాజూగ్గా కావాలనుకుంటే.. ఇవి తీసుకోండి మీ కోరిక నెరవేరుతుంది..!
ఈ రోజుల్లో అధిక బరువుతో బాధపడే వారు చియా విత్తనాలను బరువు తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. ఈ చిన్న విత్తనాలు అధిక ఫైబర్‌తో శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరచి, ఆకలి నియంత్రణలో సహాయపడతాయి. వీటి ఉపయోగం వల్ల శరీరానికి తేమను అందించి డీహైడ్రేషన్ నివారించడం కూడా జరుగుతుంది. ఈ చియా విత్తనాలను సరైన విధంగా తీసుకోవడం చాలా ముఖ్యం.

ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. డైట్ చేయడం, వ్యాయామం చేయడం వంటి మార్గాలతో పాటు కొన్ని సహజమైన ఆహార పదార్థాలు బరువు తగ్గేందుకు చాలా ఉపయోగపడతాయి. వాటిలో చియా విత్తనాలు ప్రముఖమైనవి. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ఈ విత్తనాల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇవి చాలా ఉపయోగకరంగా మారతాయి.
చియా విత్తనాల్లో పుష్కలంగా ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఇవి జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి.. ఫలితంగా ఎక్కువసేపు ఆకలి వేయదు. దీంతో తరచుగా తినాలనే కోరిక తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
చియా విత్తనాలను నేరుగా తినడం వల్ల ఫైబర్ బాగా లభిస్తుంది. అయితే వీటిని నీటిలో నానబెట్టకుండా తినడం సురక్షితమైనది కాదు. ఎందుకంటే ఇవి తేమను శోషించుకునే స్వభావం కలిగినవిగా ఉండటంతో పొట్టలోకి వెళ్లిన తర్వాత శరీరంలోని నీటిని తీసుకుని డీహైడ్రేషన్‌కి దారితీయవచ్చు. దీని వల్ల జీర్ణ సమస్యలు, పొట్ట బరువు తలెత్తే అవకాశం ఉంది. కనుక విత్తనాలను నీటిలో నానబెట్టి తినడం మంచిది.
వేసవి కాలంలో చియా విత్తనాలను నీటిలో నానబెట్టి తాగడం శరీరానికి తేమను అందించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇది డీహైడ్రేషన్ నివారించడంలో సహాయపడుతుంది. ఉదయం పూట నానబెట్టిన చియా విత్తనాలతో తయారు చేసిన పానీయాన్ని తీసుకుంటే శక్తివంతంగా, తేలికగా అనిపిస్తుంది. ఇది జీర్ణతను మెరుగుపరచడమే కాకుండా ఎక్కువ సేపు ఆకలిని నిరోధించగలదు.
చియా విత్తనాలను ఖాళీ పొట్టపై ఉదయం తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. లేకపోతే భోజనానికి అరగంట ముందు తీసుకోవచ్చు. ఈ సమయంలో తీసుకోవడం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా మీరు తినే ఆహార పరిమాణం తగ్గుతుంది. ఇది ఆహార నియంత్రణకు తోడ్పడుతుంది.
చియా విత్తనాలను వాడే పద్ధతులు చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఒక టీస్పూన్ చియా విత్తనాలను ఒక గ్లాసు నీటిలో వేసి కనీసం 30 నిమిషాలు నానబెట్టాలి. తరువాత ఆ నీటిని నేరుగా తాగవచ్చు. లేదా వీటిని పండు జ్యూస్, స్మూథీలు, పుడింగ్స్ వంటి డెజర్ట్‌లలో కలిపి తినవచ్చు. ఇవి తక్కువ కాలోరీలతో ఎక్కువ పోషకాలు అందించే ఆహారంగా నిలుస్తాయి.
చియా విత్తనాలను రోజుకు 1 లేదా 2 టీస్పూన్లకంటే ఎక్కువ తినకపోవడం మంచిది. ఎక్కువగా తింటే కొంతమందికి మలబద్ధకం, పొత్తికడుపులో గాలి, గ్యాస్, మంట లాంటి సమస్యలు రావచ్చు. అలాగే ఈ విత్తనాలు నీటిని పీల్చుకునే స్వభావం కలిగి ఉంటాయి కాబట్టి వీటిని తీసుకునేటప్పుడు తగినంత నీటిని తాగకపోతే అవి పొట్టలో గట్టిగా మారే అవకాశం ఉంటుంది. అందుకే చియా విత్తనాలను సరిపడా నీటితో పాటు తీసుకోవడం అత్యవసరం. ప్రతిరోజూ డైట్లో చియా విత్తనాలను చేర్చుకుంటే ఆరోగ్యానికి, బరువు తగ్గేందుకు చాలా సహాయపడతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




