- Telugu News Photo Gallery Blue tea benefits blue tea unbelievable health benefits of this butterfly pea flower infusion
Blue Tea: గుండె సమస్యలున్నవారు బ్లూ టీ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
వెంటనే తయారు చేసుకుని తాగండి. శంఖం పువ్వులు, ఆకులతో తయారు చేయబడిన ఈ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇది చర్మంపై ముడతలను తగ్గించి, మీ చర్మాన్ని అందంగా కనిపించేలా చేస్తుంది..
Updated on: May 04, 2025 | 8:50 PM

మీరు ఎప్పుడైనా బ్లూ టీ తాగారా? ఇప్పటి వరకు ఎప్పుడూ తాగకపోతే.. వెంటనే తయారు చేసుకుని తాగండి. శంఖం పువ్వులు, ఆకులతో తయారు చేయబడిన ఈ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇది చర్మంపై ముడతలను తగ్గించి, మీ చర్మాన్ని అందంగా కనిపించేలా చేస్తుంది.

రోజూ ఈ శంఖం పూల టీ తాగడం వల్ల శరీరంలోని అవాంఛిత కొవ్వు, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. బ్లూ టీ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారు రోజూ రెండు కప్పుల బ్లూ టీ తాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

బ్లూ టీ ఒత్తిడిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఆందోళన, నిరాశను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

బ్లూ టీ ఆస్తమా నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల డయాబెటిస్‌ను నివారించవచ్చు. బ్లూ టీ పూర్తిగా మూలికలతో తయారు చేస్తారు కాబట్టి, దీనిని ఎవరైనా తాగవచ్చు.

బ్లూ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు తగ్గుతాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. గుండెపోటు సమస్య ఉన్నవారు ఈ టీని తప్పకుండా తాగాలి. ఎందుకంటే ఇది హృదయాన్ని అన్ని రకాల సమస్యల నుంచి రక్షిస్తుంది. అంతేకాకుండా ఈ టీ క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.




