Heart attack: గుండెపోటుకు, కరోనాకు మధ్య సంబంధం ఏంటి.? అసలీ మరణాలు ఎందుకు.?
ఇదిలా ఉంటే కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు కేసులు భారీగా పెరుగుతున్నాయి. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత గుండెపోటు కేసులు 10 శాతం పెరిగినట్లు తెలిపింది. వీరిలో, 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే...

గుండెపోటు మరణాలు ఇటీవల సర్వసాధారణంగా మారిపోయాయి. ఒకప్పుడు కేవలం వయసు మళ్లిన వారిలో కనిపించే హృద్రోగ సమస్యలు ప్రస్తుతం చిన్న వారిలోనూ కనిపిస్తున్నాయి. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు. అప్పటి వరకు ఉషారుగా ఉన్నవారు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు.
ఇలా తక్కువ వయసులో ఉన్నప్పుడే గుండె పోటు కారణంగా ప్రాణాలు వదిలిన సంఘటనలు భారీగా చోటు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియా కారణంగా వీటికి సంబంధించిన వీడియోలు క్షణాల్లో దేశమంతా వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రతీ ఒక్కరిలో ఆందోళన నెలకొంటోంది. అసలీ గుండెకు ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొన్నటి మొన్న మధ్యప్రదేశ్‌కలో బీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి గుండెపోటు కారణంగా క్లాస్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయిన ఘటన అందరినీ షాక్‌కి గురి చేసింది.
ఇదిలా ఉంటే కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు కేసులు భారీగా పెరుగుతున్నాయి. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత గుండెపోటు కేసులు 10 శాతం పెరిగినట్లు తెలిపింది. వీరిలో, 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే కోవిడ్ మహమ్మారి తర్వాత గుండెపోటు కేసులు పెరగడానికి కారణం ఏమిటి? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
గుండెపోటు కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని కార్డియాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అజిత్ జైన్ ఈ విషయమై మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని రోగుల వైద్య నివేదికలు సూచిస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి విజృంభన తర్వాత.. అరిథ్మియా, గుండె ఆగిపోవడం, గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరిగాయి. కరోనా వైరస్ కారణంగా గుండె సిరల్లోనే రక్తం గడ్డకడుతుంది. దీంతో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి గుండెజబ్బులు వస్తున్నాయి. కోవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన వారిలో దాని దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటున్నాయి’ అని చెప్పుకొచ్చారు.
అనేక ఇతర కారణాలు ఉన్నాయి..
ఇక కేవలం కరోనా మాత్రమే కాకుండా గుండెపోటకు.. అధిక బీపీ, మధుమేహం కేసులు పెరగడం కారణమని ఆర్‌ఎంఎల్ ఆస్పత్రి కార్డియాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ తరుణ్‌కుమార్ చెబుతున్నారు. హై బీపీ వల్ల గుండెపోటు వస్తుంది. ప్రస్తుతం ప్రజల్లో మానసిక ఒత్తిడి కూడా బాగా పెరిగిపోయింది. యువతలో మానసిక ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. పేలవమైన మానసిక ఆరోగ్యం గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇవన్నీ కలిసి గుండెపోటు కేసులు పెరగడానికి కారణంగా మారుతున్నాయన్నారు. 20 ఏళ్ల క్రితం వరకు 50 ఏళ్లు పైబడిన వారిలో గుండెపోటు వచ్చేదని, అయితే కోవిడ్ తర్వాత ఈ విధానం మారిపోయిందని డాక్టర్ జైన్ చెప్పారు. బయటి నుంచి ఫిట్ గా కనిపించినా.. గుండెపోటు రాదని గ్యారెంటీ లేదని హెచ్చరిస్తున్నారు.
గుండెను ఎలా కాపాడుకోవాలి..
ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో.. 20 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూబాడీ చెకప్ చేయించుకోవడం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. గుండెను పరీక్షించడానికి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష, ఎకో అండ్ యాంజియోగ్రఫీ పరీక్ష బెస్ట్ అని చెబుతున్నారు. ఇవి చేస్తే తీవ్రమైన గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. దీనితో పాటు, మీ బీపీ, షుగర్ నియంత్రణలో ఉంచుకోవడానికి మంచి జీవనశైలిని అవలంభించాలని చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..




