AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

H3N2 Virus Vs COVID-19: టెన్షన్ పెడుతున్న కొత్త వైరస్.. ఇది కూడా కరోనాయేనా? రెండింటికీ మధ్య తేడా ఏంటి?

ప్రస్తుతం వస్తున్న జ్వరాలకు హెచ్3ఎన్2(H3N2) ఇన్ ఫ్లూ ఎంజా వైరస్ కారణమని వివరిస్తున్నారు. అయితే దీని లక్షణాలు కూడా కరోనా సోకినప్పుడు వచ్చినట్లే ఉంటుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు.

H3N2 Virus Vs COVID-19: టెన్షన్ పెడుతున్న కొత్త వైరస్.. ఇది కూడా కరోనాయేనా? రెండింటికీ మధ్య తేడా ఏంటి?
Cough And Cold
Madhu
|

Updated on: Mar 11, 2023 | 6:00 PM

Share

దేశాన్ని మరో కొత్త వైరస్ బెంబేలెత్తిస్తోంది. కోవిడ్ లాగే వేగంగా విస్తరిస్తోంది. అకస్మాత్తుగా జ్వరం, ఆపై జలుబు, దగ్గు, తలనొప్పి, వికారం, వాంతులు.. మందులు వాడుతున్నా ఎంతకీ అదుపుకానీ వైనం.. జ్వరం మూడు నాలుగు రోజుల్లో తగ్గిపోయినా, దగ్గు మాత్రం 10 నుంచి 15 రోజులు వేధించడం.. వెరసి జనాల ఆందోళన తారస్థాయికి చేరుతోంది. అందరూ కరోనా మళ్లీ విజృంభిస్తుందని టెన్షన్ పడుతున్నారు. అయితే అది కరోనా కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వస్తున్న జ్వరాలకు హెచ్3ఎన్2(H3N2) ఇన్ ఫ్లూ ఎంజా వైరస్ కారణమని వివరిస్తున్నారు. అయితే దీని లక్షణాలు కూడా కరోనా సోకినప్పుడు వచ్చినట్లే ఉంటుండటంతో జనాల్లో గందరగోళం ఉంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19, హెచ్3ఎన్2 ఇన్ ఫ్లూ ఎంజా వైరస్ వైరస్ ల మధ్య తేడా ఏంటి? వీటి లక్షణాలు ఏమిటి? ఓసారి చూద్దాం రండి..

నిరంతరం దగ్గు, విపరీతమైన గొంతునొప్పి..

ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్ సీజనల్ ఇన్ ఫ్లూ ఎంజా హెచ్3ఎన్2 ఏ రకానికి చెందినది నిపుణులు చెబుతున్నారు. నిరంతర దగ్గు, జ్వరం, విపరీతమైన గొంతునొప్పి, జలుబు, వికారం ప్రధాన లక్షణాలుగా వెల్లడించారు. సాధారణంగా సీజనల్ ఇన్ ఫ్లూ ఎంజా నాలుగు రకాలు. ఏ, బీ, సీ, డీ ఇలా 4 టైప్స్ ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇన్ఫ్లూయెంజా ఏ , బీ వైరస్ లు వ్యాప్తి చెందుతాయి. అయితే ఈ వైరస్ సోకినవారు యాంటీబయాటిక్స్ ని వినియోగించవద్దని సూచిస్తున్నారు. అలాగే యుతులు సబ్బుతో, నీళ్లతో శుభ్రం చేసుకోవాలంటున్నారు మాస్కులు ధరించాలని, రద్దీ ప్రాంతాల్లో తిరగకూడదని.. తుమ్ము, దగ్గు వచ్చేటప్పుడు నోరు, ముక్కు చేతులతో కవర్ చేసుకోవాలని సూచిస్తున్నానరు. అస్తమానం కళ్ళను, ముక్కుని ముట్టుకోవడం తగ్గించాలని చెబుతున్నారు. ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలని. ఒంటి నొప్పులు, జ్వరం ఉంటే గనుక పారాసెటమాల్ మాత్ర వేసుకోవాలని చెబుతున్నారు.

కోవిడ్-19, H3N2 మధ్య తేడాలు ఏంటి?

కోవిడ్-19, హెచ్3ఎన్2 ఇన్ఫ్లూయెంజా ఈ రెండూ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి ద్వానా సోకే వైరస్ లే. అంతేకాక గణనీయంగా పరివర్తన చెందుతాయి. ఈ రెండు వైరస్ ల వల్ల శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా సంక్రమిస్థాయి. కానీ ఈ రెండు వైరస్ లు వేరు వేరు వైరస్ కుటుంబానికి చెందినవి. సార్స్-కోవ్-2 వైరస్ వల్ల కోవిడ్-19 వస్తే, హెచ్3ఎన్2 అనేది మనుషుల్లో వ్యాపించే ఇన్ఫ్లూయెంజా ఉపకారకాల్లో ఒకటి. చ్3ఎన్2 ఇన్ఫ్లూయెంజా వల్ల జ్వరం, గొంతు మంట, దగ్గు, ఒళ్ళు నొప్పులు, జలుబు వంటి లక్షణాలు కనబడతాయి. దగ్గు వెంటనే తగ్గదు. సీజనల్ జ్వరం 5 నుంచి 7 రోజులు ఉంటుంది. కొన్ని కేసుల్లో దగ్గు 3 వారాల పాటు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇంక్యుబేషన్ పీరియడ్ చాలా తక్కువ..

  • ఓ వ్యక్తికి వైరస్ సోకిన టైం నుంచి లక్షణాలు మొదలయ్యే టైంకి మధ్య ఉన్న సమయాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు.
  • ఒక మనిషి నుంచి మరొక మనిషికి సార్స్-కోవ్ -2 వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అనారోగ్యానికి దారి తీయడానికి 2 నుంచి 14 రోజులు పడుతుంది. అంటే కోవిడ్-19 లక్షణాలు కనబడడానికి 2 నుంచి 14 రోజులు సమయం పడుతుంది.
  • అదే సీజనల్ ఇన్ఫ్లూయెంజా విషయానికొస్తే ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది.
  • ఇన్ఫెక్షన్ నుంచి అనారోగ్యానికి అంటే ఈ వైరస్ లక్షణాలు కనబడడానికి 1 నుంచి 4 రోజులు పడుతుంది.

నిర్ధారణ ఇలా..

అయితే కోవిడ్-19 వచ్చిందా? లేక ఫ్లూ వచ్చిందా? అనేది స్వతహాగా నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. రాపిడ్ యాంటిజెన్ టెస్ట్లేదా ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేసుకోవచ్చు. కోవిడ్-19, ఇన్ఫ్లూయెంజా లక్షణాలు ఇంచుమించు ఒకేలా ఉన్నా గానీ రెండు వైరస్ లు ఒకటి కాదని వైద్యులు వెల్లడించారు.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..