AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Insurance: కంపెనీది ఉందని ప్రైవేట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోలేదా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

Health Insurance Benefits: ఆరోగ్య బీమా.. కోవిడ్ కు పూర్వం దీనిపై పెద్దగా ఎవరు ఆసక్తి చూపేవారు కాదు. కేవలం ఉన్నత వర్గాల్లో మాత్రమే దీనిని చేయించుకునే వారు. కానీ మహమ్మారి వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటున్నారు.

Health Insurance: కంపెనీది ఉందని ప్రైవేట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోలేదా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Health InsuranceImage Credit source: TV9 Telugu
Janardhan Veluru
|

Updated on: Dec 10, 2022 | 1:22 PM

Share

Health Insurance Benefits: ఆరోగ్య బీమా.. కోవిడ్ కు పూర్వం దీనిపై పెద్దగా ఎవరు ఆసక్తి చూపేవారు కాదు. కేవలం ఉన్నత వర్గాల్లో మాత్రమే దీనిని చేయించుకునే వారు. కానీ మహమ్మారి వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటున్నారు. ఆరోగ్య స్పృహ పెరగడం.. ఎంత ఖర్చయిన ప్రైవేటు ఆస్పత్రుల వైపు ప్రజలు మొగ్గుచూపుతుండటంతో ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్ కు డిమాండ్ ఏర్పడుతోంది. దీని ద్వారా ఖర్చు గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్న ఆలోచన అందరినీ వాటివైపు మళ్లిస్తోంది. అయితే హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునే టప్పుడు చాలా మంది దానిలోని షరుతులు, నిబంధనలు పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా ఏ వయసులో హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలి.. అనే విషయాలను లైట్ తీసుకుంటారు. తద్వారా ఇన్స్యూరెన్స్ క్లైమ్ చేసినప్పుడు రిజక్షన్లకు గురవుతుంటారు. మరి కొంతమంది వారు పనిచేసే కంపెనీ హెల్త్ ఇన్స్యూరెన్స్ అందిస్తుందిగా.. రిటైర్ అయిన తర్వాత వేరే హెల్త్ ఇన్స్యూరెన్స్ చూద్దాంలే అనుకుంటారు. కానీ ఇది ప్రయోజనకరం కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హెల్త్ ఇన్స్యూరెన్స్ అంటే ఏమిటి? వృద్ధాప్యంలో దీనిని తీసుకుంటే ఏమవుతుంది? అసలు ఏ వయసులో ఈ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే వినియోగదారుడికి మేలు అనే అంశాలను తెలుసుకుందాం..

హెల్త్ ఇన్స్యూరెన్స్ అంటే..

ప్రస్తుతం మనిషి ఆరోగ్యం గాలిలో దీపంలా తయారైంది. ఎప్పుడు ఎటు నుంచి ఏ వైరస్ దాడి చేస్తుందో తెలియడం లేదు. రోజురోజుకూ కొత్త వైరస్ పుట్టుకొస్తున్నాయి. ఇక దీర్ఘకాలిక వ్యాధులు సరేసరి. ఇటువంటి సమయంలో నాణ్యమైన వైద్యం అత్యవసరం. అందుకే అందరూ కార్పొరేట్ ఆస్పత్రుల బాట పడుతున్నారు. దీంతో ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యానికి భరోసా నిచ్చేదే ఆరోగ్య బీమా. ఒకసారి పాలసీ తీసుకుంటే.. నెలనెలా పాలసీ కట్టుకుంటూ దానిని యాక్టివ్ గా ఉంచుకుంటే.. ఎటువంటి భయం లేకుండా ఎంచక్కా కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందొచ్చు. హెల్త్ ఇన్స్యూరెన్స్ ద్వారా క్లైమ్ చేసుకోవచ్చు.

ఏ వయసులో చేసుకుంటే మేలు..

చాలామంది ఉద్యోగులకు వారు పని చేసే కంపెనీ హెల్త్ ఇన్స్యూరెన్స్ అందిస్తుంది.  కాబట్టి వారు వ్యక్తిగతంగా హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోరు. కానీ ప్రైవేటు హెల్త్ ఇన్స్యూరెన్స్ విషయంలో రిటైర్మెంట్ వరకూ ఆగడం చాలా అనాలోచితం అని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం హెల్త్ ఇన్స్యూరెన్స్ అందించే కంపెనీలు ఇన్స్యూరెన్స్ తీసుకొనే వ్యక్తి వయసు, ఆరోగ్య పరిస్థితులను బేరీజు వేసుకుంటాయి. తక్కువ వయసులో సర్వ సాధారణంగా ఆరోగ్యంగా ఉంటారు.. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆస్పత్రి ఖర్చులూ ఎక్కువ అవుతాయి. అందుకనే హెల్త్ ఇన్స్యూరెన్స్ ను వీలైనంత వరకూ తక్కువ వయసు ఉన్నప్పుడు.. అది కూడా ఏ దీర్ఘకాలిక వ్యాధులు లేనప్పుడే తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల పాలసీ తీసుకున్న ఒకటి రెండేళ్ల పాటు క్లైమ్ కు అవసరం రాదు. ఆ తర్వాత చేసుకునే క్లైమ్ సెటిల్మెంట్స్ ఈజీ చేసేందుకు వీలుంటుంది.

ఇవి కూడా చదవండి

మీకున్న వ్యాధులను చెప్పాలి..

పాలసీ తీసుకునే ముందు కొంత మంది వారి కున్న దీర్ఘకాలిక వ్యాధులను చెప్పరు. అందువల్ల  క్లైమ్ చేసుకునేటప్పుడు ఇబ్బందులు పడతారు. ఒకవేళ మీకున్న వ్యాధుల గురించి చెబితే కొంత వెయిటింగ్ పిరియడ్ను వారు విధిస్తారు. అది పూర్తయిన తర్వాత పాలసీ క్లైమ్‌ను మీరు వినియోగించుకోవచ్చు.

కంపెనీ ఇచ్చే ఇన్స్యూరెన్స్ ఉంటే చాలా?

చాలా మంది కంపెనీ ఇచ్చే ఇన్స్యూరెన్స్ ఉంటే చాలన్న ఆలోచనతో ఉంటారు. కంపెనీ ఇచ్చే ఇన్స్యూరెన్స్ ఉందిగా.. అది చాలులే రిటైర్ అయ్యాక వేరేది చూడొచ్చులే అనుకుంటారు. కానీ సరికాదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఏ కంపెనీ అయిన ఆరోగ్య బీమా రూ. 3 లక్షల నుంచి 5 లక్షల లోపు మాత్రమే ఇస్తారు. ప్రస్తుత వైద్య ఖర్చులకు ఇది ఏమాత్రం సరిపోయేది కాదు.

రిటైర్మెంట్ కు దగ్గరపడితే ఏం చేయాలి..

రిటైర్మెంట్‌కు దగ్గర పడిన వారు తప్పనిసరిగా మెడికల్ కన్టిజెన్సీ ఫండ్ ను ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడేలా ఆరోగ్యానికి కొంత సొమ్మును పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుందని సూచిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ ఆస్పత్రి ఖర్చులూ పెరుగుతూ ఉంటాయి. మందులని, వైద్య పరీక్షలని, రెగ్యూలర్ చెకప్ లని, కన్సల్టేషన్ చార్జీలని పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇటువంటి వాటికి ఆరోగ్య బీమా కూడా వర్తించదు. అలాంటప్పుడు ఈ అత్యవసర నిధి ఉపయోగపడుతుంది.

మరిన్ని హెల్త్ కథనాలు చదవండి..