Weight Loss Exercise: గాలిలో స్విమ్మింగ్ చేస్తే బెల్లీ ఫ్యాట్ వేగంగా కరిగిపోతుంది.. ఎలా చేయాలో తెలుసా..
Fat Burning Exercises: బరువు తగ్గడానికి డైటింగ్‌తో పాటు కొన్ని వ్యాయామాలు చేయడం అవసరం. రోజూ ఈ 2 వ్యాయామాలతో ఊబకాయాన్ని వేగంగా తగ్గించుకోవచ్చు.
Belly Fat loss: ఈ రోజుల్లో ఊబకాయం ఒక పెద్ద సమస్యగా మారింది. ఇది శరీరంలోని ఇతర వ్యాధులను ఆహ్వానిస్తుంది. బరువు పెరగడం వల్ల శరీరంలో వ్యాధులు పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో మీరు సమయానికి ఊబకాయాన్ని నియంత్రించుకోవాలి. స్థూలకాయం మొదట పొట్టపైకి వచ్చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ పొట్టలోని కొవ్వును తగ్గించాలని కోరుకుంటారు. జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కడుపు మొదట బయటకు వస్తుంది. ఈ సమస్య కూర్చుని ఉద్యోగాలు చేసేవారిలో అధికంగా కనిపిస్తుంది. వీరు ఈ సమస్యతో చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇలాంటి సమయంలో మీరు ఇంట్లోనే కొన్ని సాధారణ వ్యాయామాలు చేయడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. బొడ్డు చుట్టూ పెరుకుపోయే కొవ్వును తగ్గించడానికి మీరు గాలిలో ఈత కొట్టాలి.. అవును మీరు చదివింది నిజమే.. ఇది చాలా సులభమైన వ్యాయామం.. ఇది మీ బొడ్డుపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ఈ వ్యాయామాన్ని ఇంట్లోనే ఎలా చేయాలో తెలుసుకుందాం..
1- ఎయిర్ స్విమ్మింగ్- పొట్ట తగ్గడానికి ఇది చక్కటి వ్యాయామం. ఇది వెన్నును బలపరుస్తుంది. నొప్పి నుంచి ఉపశమనం కూడా అందిస్తుంది. మీరు వెన్నునొప్పితో బాధపడుతుంటే.. ప్రతిరోజూ కొద్దిసేపు ఎయిర్ స్విమ్మింగ్ చేయండి. గాలిలో స్విమ్మింగ్ చేయడానికి.. మీరు మొదట మీ పొట్టపై పడుకోవాలి. ఇప్పుడు మీ రెండు చేతులు, కాళ్ళు రెండు వైపుల పెట్టండి. దీని తర్వాత నేల నుంచి చేతులు, కాళ్ళను ఎత్తడానికి ప్రయత్నించండి. మీరు గాలిలో తేలియాడుతున్నట్లు అనిపిస్తుంది. ఇది మీ పొట్టపై ఒత్తిడిని కలిగిస్తుంది, పొట్ట కొవ్వును తగ్గిస్తుంది.
2- కార్డియో వ్యాయామం- ఫిట్‌నెస్ కోసం మీకు ఎక్కువ సమయం లేకపోతే.. మీరు కార్డియో వ్యాయామంతో కూడా బరువు తగ్గవచ్చు. ఇందులో నడక, పరుగు లేదా సైక్లింగ్ చేస్తే సరిపోతుంది. కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోతుంది. మీకు సమయం దొరికినప్పుడల్లా ఉదయం లేదా సాయంత్రం కార్డియో వ్యాయామాలు చేయవచ్చు. ఖాళీ కడుపుతో కార్డియో చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. కొవ్వును వేగంగా తగ్గిస్తుంది.
వీటితోపాటు యోగాలోని వీటిని కూడా ట్రై చేయవచ్చు.. ఇందులో..
భుజాంగాసనం: బోర్లా పడుకోవాలి. చేతులను నేలపై ఉంచాలి. చేతుల మీద బరువు మోపుతూ నడుము పైభాగాన్ని గాల్లోకి లేపాలి. ఈ భంగిమలో 25 సెకన్లు ఉండి తిరిగి క్రితం భంగిమలోకి రావాలి. పెద్దప్రేగు, పొట్టలోని వాయువును భుజంగాసనం బయటకు పంపుతుంది. ఈ ఆసనంతో కటి దగ్గరి కండరాలు బలపడతాయి. పైకడుపు, పొత్తి కడుపు దగ్గర పేరుకున్న కొవ్వు కరుగుతుంది. అదే సమయంలో చేతుల మీద బరువు ఉంచడం వల్ల భుజాలు, చేతుల్లోని కండరాలు కూడా బలపడతాయి. మెడ, వీపుకు సంబంధించిన అన్నిరకాల నొప్పులకు ఉపశమనం కలుగుతుంది.
వశిష్టాసనం: కుడి మోచేయి ఆసరాతో పక్కకు పడుకోవాలి.కుడి కాలు ముందుకు, ఎడమకాలు వెనుకకు ఉంచాలి.చేయి మీద బరువు ఉంచి, నడుమును గాల్లోకి లేపాలి.ఇలా చేస్తున్నప్పుడు మోచేయి, పాదాలు మాత్రమే నేలను తాకి ఉండాలి. రెండో చేయి నేలమీద ఉంచిన చేతికి సమాంతరంగా గాల్లో లేపి ఉంచాలి. ఈ ఆసనం కడుపు, వెన్ను, పిరుదులలోని కండరాలకు బలాన్నిస్తుంది. ఆ ప్రదేశాల్లోని కొవ్వు కరుగుతుంది. కొవ్వు కరిగి శరీర సమతుల్యత పెరగుతుంది. ఏకాగ్రత మెరుగుపడుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)