Coriander: రుచిలోనే కాదు ఆరోగ్యం లోనూ అమోఘమే.. కొత్తిమీర ప్రయోజనాలు తెలిస్తే లొట్టలేయాల్సిందే
కొత్తిమీర (Coriander) లేకుండా భారత్‌లో దాదాపు ఏ వంటకమూ పూర్తికాదు. ఇంత విస్తృత వినియోగం ఉన్న వేరే ఆహార పదార్థం ఏదీ లేదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరలోని ప్రతి భాగమూ ఉపయోగకరమైనదే. ఆకులను కూరలు, పప్పులలో....
కొత్తిమీర (Coriander) లేకుండా భారత్‌లో దాదాపు ఏ వంటకమూ పూర్తికాదు. ఇంత విస్తృత వినియోగం ఉన్న వేరే ఆహార పదార్థం ఏదీ లేదు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరలోని ప్రతి భాగమూ ఉపయోగకరమైనదే. ఆకులను కూరలు, పప్పులలో గార్నిషింగ్‌కు వినియోగిస్తారు. రొట్టెలు, మాంసాహార వంటకాలలోనూ కలుపుతారు. వేర్లు, కాండం సూప్‌లో వేస్తారు. గింజలను మసాలా దినుసుగా వినియోగిస్తారు. కాగా ధనియాకు ప్రపంచ గుర్తింపు ఇవ్వాలని కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో డిమాండ్ వస్తోంది. కొత్తిమీరను నేషనల్ హెర్బ్‌గా (National Herb) గుర్తించాలని భోజనప్రియులు డిమాండ్ చేస్తున్నారు. రాణికి కిరీటం లేకపోతే ఎలా ఉంటుందో వంటల్లో కొత్తిమీర లేకపోయినా అలానే ఉంటుందని అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఫుడ్ సైన్సెస్ అండ్ న్యూట్రిషన్ ఎన్‌సైక్లోపీడియా ప్రకారం.. కొత్తిమీర క్రీస్తుపూర్వం 5000 ఏళ్ల కిందటి నుంచే ఉంది. జీర్ణ, శ్వాస, మూత్రకోశ సంబంధిత సమస్యల నివారణకు గ్రీకులు, రోమన్లు కొత్తిమీరను వాడినట్లుగా చరిత్రలో ఉంది.
చైనా, భారత్, యూరప్‌లో వేల ఏళ్ల కిందట నుంచే కొత్తిమీర సాగు ఉంది. రుచికోసమే కాకుండా ఆరోగ్యపరంగా కలిగే ప్రయోజనాల రీత్యా కూడా కొత్తిమీర వాడకం పెరుగుతోంది. చాలామంది ఇప్పుడు దీన్ని తమ పెరట్లోనో, మిద్దెలపైనో పెంచుకుంటున్నారు కూడా. కొలెస్ట్రాల్ తగ్గించడంలో, డయాబెటిస్‌ను అదుపులో ఉంచడంలో కొత్తిమీర ఉపయోగపడుతుందనీ చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి