Health Tips: ఉదయమా.? సాయంత్రమా.? ఏ సమయంలో వాకింగ్ చేస్తే బరువు తగ్గుతారంటే..
కొబ్బరి నూనె డైట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, టెన్ మినిట్స్ వర్కౌట్, పవర్ యోగా, కీటా డైట్ ఇలా చాలారకాలుగా బరువు తగ్గేందుకు ఆరోగ్యంగా ఉండేందుకు ఫార్ములాస్ వచ్చాయి. ఇప్పుడు కొత్తగా ప్రపంచవ్యాప్తంగా ఆల్ సిక్స్ ఫార్ములా రంగంలోకి దిగింది.
ప్రజల్లో రోజురోజుకీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుంది. రకరకాల ఫిట్నెస్ ప్రాక్టీస్‌లు, డైట్ కంట్రోల్‌తో మార్కెట్లో వచ్చిన ప్రతి ఫార్ములాను పాటిస్తున్నారు. కొబ్బరి నూనె డైట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, టెన్ మినిట్స్ వర్కౌట్, పవర్ యోగా, కీటా డైట్ ఇలా చాలారకాలుగా బరువు తగ్గేందుకు ఆరోగ్యంగా ఉండేందుకు ఫార్ములాస్ వచ్చాయి. ఇప్పుడు కొత్తగా ప్రపంచవ్యాప్తంగా ఆల్ సిక్స్ ఫార్ములా రంగంలోకి దిగింది. అమెరికాలో మొదలైన ఆల్ సిక్స్ ఫార్ములా ఇప్పుడు భారత్‌లోనూ ట్రెండింగ్‌లో ఉంది. 6666 ఫార్ములా అంటే చాలా సింపుల్ ఇది డైట్‌కి సంబంధం లేని వాకింగ్ టెక్నిక్. అసలు ఈ ఆల్ సిక్స్ అంటే ఏంటో చూద్దాం..
ఇది చదవండి: మీరు పుట్టిన తేదీని బట్టి మీ వెనకున్న దేవుడెవరో చెప్పొచ్చు.! ఎలాగో తెల్సా
రోజువారి మీ వాకింగ్‌లో ఈ ఆరు అంకెను చేర్చడమే. అంటే ఉదయం 6 గంటలకు లేదా సాయంత్రం 6 గంటలకు తప్పనిసరిగా వాకింగ్ చేయాలి. అది కూడా వాకింగ్‌కి ముందు ఆరు నిమిషాలు వార్మప్ చేయాలి, వాకింగ్ తర్వాత ఆరు నిమిషాలు కూల్ డౌన్ సెషన్ చేయాలి. మధ్యలో 60 నిమిషాల వాకింగ్ చేయాలి. ఇదే ఫార్మాట్‌ని రెగ్యులర్‌గా చేయడం వల్ల చాలా సమస్యలకి చెక్ పెట్టొచ్చు అంటున్నారు. ఉదయం 6 గంటలకి వాకింగ్ మొదలుపెట్టడం వల్ల అత్యధిక బెనిఫిట్స్ ఉంటాయట. మెటబోలిజం హైలెవెల్‌కి వెళుతుంది. ఎక్కువ క్యాలరీస్ బర్నవ్వాలంటే ఉదయం పూట నడక మంచిదని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ పరిశోధన చెబుతుంది.
ఇది చదవండి: తస్సాదియ్యా.! పే..ద్ద టాస్కే ఇది.. పామును గుర్తిస్తే మీరే తెలివైనవారే
సాయంత్రం 6 గంటలకు చేసే వాకింగ్ మరో రకమైన బెనిఫిట్ ఇస్తుంది. ఉదయం నుంచి ఉన్న ఒత్తిడిని తొలగిస్తుంది. జీర్ణ ప్రక్రియను పెంపొందిస్తుంది. బ్లడ్ ప్రెషర్, యాంగ్జైటీ నివారిస్తుంది. మంచి నిద్రకు ఉపయోగపడుతుంది. ఉదయం సాయంత్రం రెండుసార్లు వాకింగ్ చేయడం వల్ల డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి అంటున్నారు వైద్య నిపుణులు. ఇక అన్నిటికంటే ముఖ్యం ఆరు నిమిషాల ముందు వార్మప్ చేయడం, నిద్ర లేవగానే షూస్ వేసుకొని డైరెక్టుగా వాకింగ్‌కి వెళ్లకుండా.. కొద్దిసేపు చిన్నచిన్న వ్యాయామాలతో వార్మప్ చేయడం ద్వారా కండరాలు గట్టిపడతాయి. శరీరాన్ని వాకింగ్‌కి సిద్ధం చేస్తుంది. బాడీ టెంపరేచర్ బ్యాలెన్స్‌గా ఉంటుంది. యాక్టివ్‌గా వాకింగ్ చేయడానికి ఈ వార్మప్ చాలా ఇంపార్టెంట్.
ఇక వాకింగ్ తర్వాత ఆరు నిమిషాల కూల్ డౌన్ సెషన్ కూడా చాలా ముఖ్యం. గంటసేపు వాకింగ్ చేసిన తర్వాత మళ్లీ మీ శరీరాన్ని కాస్త కూల్ డౌన్ చేయాలి. అంటే చివర్లో నడకను మెల్లిమెల్లిగా.. స్లోగా నడవాలి. హార్ట్ బీట్‌ని స్లోగా తగ్గించుకునే చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయి. స్ట్రెచింగ్ చేయడం కూడా ఉత్తమం అంటున్నారు డాక్టర్లు. ఏదో వాకింగ్‌కి వెళ్తున్నాం అనుకున్నట్లు కాకుండా ఈ ఆల్ సిక్స్ ఫార్ములాతో బెటర్ బెనిఫిట్స్ గ్యారంటీ అంటున్నారు.
ఇది చదవండి: బాబోయ్.. అది రోడ్డు కాదు భారీ కొండచిలువ.. పట్టు జారితే పరలోకానికే
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి