రోజుకో పియర్.. ఆ సమస్యలన్నీ పరార్.. 

TV9 Telugu

17 November 2024

పియర్ ఒక సాధారణ పండుగా భావించి చాలా మంది దీనిని తినరు. బహుశా అలాంటి వారికి బేరిపండు ప్రయోజనాల గురించి తెలియకపోవచ్చు.

పియర్ అనేది కాలానుగుణంగా లభించే పండు. వర్షాకాలంలో పియర్ పండును తప్పనిసరిగా తినాలి అంటున్నారు నిపుణులు.

వర్షాకాలంలో రోజంతా బ్యాక్టీరియా రహితంగా, తాజాదనాన్ని అందించే పియర్ చాలా ముఖ్యమైన పండు అని పేర్కొన్నారు.

దీన్ని తీసుకోవడం ద్వారా అనేక రకాల వ్యాధులను అధిగమించవచ్చు. ఆయుర్వేదంలో కూడా దీనికి భిన్నమైన స్థానం ఉంది.

పియర్ పండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఏయే వ్యాధులకు బేరిపండు దివ్యౌషధమో ఇప్పుడు తెలుసుకుందాం.

బేరిని ఖాళీ కడుపుతో ప్రతిరోజూ తినడం చాలామంచిది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఆహారంలో పియర్‌ను భాగంగా చేసుకుంటే ఇందులోని మూలకాలు మీ బరువును రెండింతలు వేగంగా తగ్గించడంలో సహాయపడతాయి.

ఇది చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ మొత్తాన్ని పెంచడంలో సహాయపడుతుంది. దీని వినియోగం రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది.