తలకాయ కూరతో ఆ సమస్యలు అన్ని ఖతం..

TV9 Telugu

16 November 2024

మేక తలకాయనులో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

రోగ నిరోధశక్తి పెంచడంలో కూడా తలకాయ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ బి12 రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

ఐరన్‌ లోపంతో బాధపడే వారికి కూడా తలకాయ కూర ఉపయోపగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా లభించే ఐరన్‌ రక్త హీనతకు చెక్‌ పెడుతుంది.

మేక తలకాయ కూరలోని గ్లూకోసమైన్, కాండ్రాయిటిన్ కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే మేక తలకాయను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని కాల్షియం, ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి మంచి చేస్తాయి.

చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తల కాయ కూరను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

మేక తలకాయలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడంలో ఉపయోగపడతాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.