ప్రతి రోజూ కాజు తింటే ఏమవుతుంది..! వీటిని తెలుసుకోండి..
జీడిపప్పు తినడం వల్ల బరువు పెరుగుతారని, శరీరంలో కొవ్వు పేరుకుంటుందని చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది. కానీ, జీడిపప్పును రోజూ మితంగా తీసుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. జీడిపప్పు శక్తివంతమైన ప్రయోజనాలు ఆరోగ్యకరమైన గుండె, బలమైన నరాల ,కండరాల పనితీరు. రోజూ జీడిపప్పు తినడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
జీడిపప్పు తినడం వల్ల ఎక్కువ కేలరీలే శరీరానికి అందుతాయి. కేలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ జీడిపప్పులు బరువు తగ్గడంలో సహాయపడతాయంటున్నారు పోషకాహార నిపుణులు. జీడిపప్పు ఇతర నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీవక్రియను వేగవంతం చేయడానికి, కొవ్వును కాల్చడానికి సహాయపడతాయి. ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. కాబట్టి, బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి కాజు అద్భుతమైన చిరుతిండి.
అంతేకాదు.. కాజులో ఎక్కువగా ప్రొటీన్, కొవ్వులు, మెగ్నీషియంలు ఉంటాయి. దీన్ని తినడం వల్ల శరీరంలో మంచి కొవ్వుల నిల్వలు పెరుగుతాయి. కాజులో ఉండే అన్ శాచురేటెడ్, మోనో అన్ శాచురేటెడ్ కొవ్వుల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలోని మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తుంది. జీడిపప్పులో లినోలెయిక్ యాసిడ్, పాల్మిటిక్ యాసిడ్, స్టియరిక్ యాసిడ్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
జీడిపప్పులో విటమిన్ ఈతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. కాజును తీసుకోవటం వల్ల ఎముకల ఆరోగ్యం, నరాల పనితీరు మెరుగుపడుతుంది. అనారోగ్యాలతో బాధపడేవారు జీడిపప్పును క్రమంగా మితంగా తినడంతో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాజులో రాగి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున మీ చర్మానికి ప్రకాశవంతంగా, మెరిసే రూపాన్ని అందించడంలో సహాయపడుతుంది.
జీడిపప్పు గింజల నుండి తయారైన జీడిపప్పు నూనె మీ చర్మానికి అద్భుతమైనది. జీడిపప్పు నూనెలో సెలీనియం, జింక్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. వారు ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ అద్భుతమైన ప్రొవైడర్లు కూడా. మెగ్నీషియం కొరత అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కాజు రెగ్యులర్ ఉపయోగం మీ మెగ్నీషియం స్థాయిలు సమతుల్యంగా ఉండేలా చేస్తుంది. జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
నోట్: ఇక్కడ ఉన్న విషయాలు కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం. మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.