- Telugu News Photo Gallery Mixing Amla Powder With Coconut Oil And Applying It Will Give You Long Thick Hair
జుట్టు సమస్యలతో అలసిపోయారా..? ఈ ఒక్క చిట్కా ట్రైచేయండి.. మీ హెయిర్ రెండింతలు పెరుగుతుంది!
Hair Care Tips :మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం కారణంగా చాలా మంది జుట్టు ఊడిపోవడం, వెంట్రుకలు తెల్లబడడం.. వంటి సమస్యలతో బాధడుతున్నారు. ఇలాంటి వారు.. ఉసిరి, కొబ్బరినూనె హెయిర్ మాస్క్ ట్రై చేశారంటే మంచి ఫలితం పొందవచ్చంటున్నారు నిపుణులు. ఈ హెయిర్‌ప్యాక్ తయారీ, ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Nov 18, 2024 | 8:46 AM

ఉసిరికి మూత్రవిసర్జన లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ఎక్కువ మూత్రాన్ని విడుదల చేస్తుంది. కాబట్టి ఉసిరికాయను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. ఈ సమస్యలు లేనివారు చలికాలంలో ఉసిరి పరిమిత మోతాదులో తినవచ్చు. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

కొబ్బరి నూనెలో కూడా ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన శరీరంలో జీవక్రియను వేగవంతం చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. కొబ్బరి నూనె తలపై తేమను నిలిపి ఉంచి, జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం వంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తలలో చికాకును తగ్గించి, స్కాల్ప్‌కు మంచి రిలీఫ్ కలిగిస్తాయి.

కొబ్బరి నూనె, ఉసిరి పొడితో హెయిర్ మాస్క్‌ను తయారు చేయటానికి ముందుగా ఒక గిన్నెలో కాస్త కొబ్బరినూనె తీసుకొని లైట్‌గా వేడి చేయండి. ఆ తర్వాత అందులో ఉసిరికాయ పొడిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమం చల్లారాక దాన్ని మీ జుట్టు, తల చర్మంపై పూర్తిగా పట్టేలా అప్లై చేయండి. అలా 1 గంట పాటు ఆరిపోయిన తరువాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి.

తరచూ ఇలా చేయడం ద్వారా మీ జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది. ఈ కొబ్బరినూనె, ఉసిరికాయ పొడి మిశ్రమాన్ని జుట్టుకి అప్లై చేయడం వల్ల ఇంకా అనేక ఇతర సమస్యలు కూడా నయం కావడంతో పాటు.. స్కాల్ప్‌లో రక్త ప్రసరణ పెరుగుతుందని, ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఉసిరి, కొబ్బరి నూనె రెండూ జుట్టు రాలడాన్ని నిరోధించే లక్షణాలను కలిగి ఉంటాయి. ఉసిరి పొడి జుట్టు మూలాలను బలపరుస్తుంది.. జుట్టు నెరసిపోవడాన్ని తగ్గిస్తుంది. కొబ్బరి నూనె తలకు పోషణనిస్తుంది. జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ఉసిరి,కొబ్బరి నూనె తలకు తేమను అందిస్తాయి..పొడిబారిన, చుండ్రుసమస్య నుండి రక్షిస్తుంది. ఇది తలలో వచ్చే ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది. ఈ ప్యాక్‌ను క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే మీ జుట్టు దృఢంగా మారి, నిగనిగలాడుతుంది.





























