స్టార్ హీరో విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్ దెబ్బకు సినిమా గుర్తొస్తుంది !!

స్టార్ హీరో విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్ దెబ్బకు సినిమా గుర్తొస్తుంది !!

Phani CH

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 17, 2024 | 9:20 PM

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్. ఈ కేసును విచారించిన న్యాయ స్థానం నవంబర్ 15 కీలక ఆదేశాలు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితమే తన భార్య ఆర్తితో విడాకులు కావాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు హీరో జయం రవి. అంతకు ముందు ఇదే విషయంపై ఓ బహిరంగ లేఖను కూడా విడుదల చేశాడు. అయితే జయం రవి భార్య ఆర్తి మాత్రం తన భార్యపై సంచలన ఆరోపణలు చేసింది.

అసలు విడాకుల విషయం తనకు తెలియదని, రవి చేసిన ప్రకటనతో తాను ఆశ్చర్యపోయానని ఆర్తి కూడా సోషల్ మీడియాలో ఒక లేఖ విడుదల చేసింది. దీంతో తనకు వెంటనే విడాకులు కావాలని జయం రవి కోర్టు మెట్లెక్కాడు. ఈ మేరకు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాడు. ఇక తాజాగా రవి పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. రాజీ చేసుకునేందుకు ప్రయత్నించాలని రవి, ఆర్తిలకు సూచించింది. నవంబర్ 15న జరిగిన విచారణకు రవి కోర్టుకు హాజరు కాగా.. ఆయన భార్య ఆర్తి మాత్రం వర్చువల్‌గా హాజరైంది. వీడియో కాల్‌లో అందుబాటులోకి వచ్చింది. విచారణలో భాగంగా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. మరోసారి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని.. రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని జయం రవి- ఆర్తిలకు సూచించింది. మరి కోర్టు సూచనలతో రవి, ఆర్తిలు విడాకులపై వెనక్కు తగ్గుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Diabetes: ఇండియాలో డయాబెటీస్ డేంజర్ బెల్స్

రైల్వే స్టేషన్‌లో ఆ బ్యాగ్ వద్దకు పరిగెత్తుకు వెళ్లిన స్నిఫర్ డాగ్.. అనుమానంతో చెక్ చేయగా !!

చావు బతుకుల్లో ఉన్నోడిని తన గొప్ప మనసుతో కాపాడిన తమన్

స్నేహతో.. అల్లు అర్జున్ ప్రేమ !! తెలియగానే నిర్మలమ్మ 1st రియాక్షన్ ఇదే !!

TOP 9 ET News: చిరుతో మొదలెట్టి ప్రభాస్‌ వరకు.. ఫ్యాన్స్‌కు బన్నీ పిచ్చ క్లారిటీ..

Published on: Nov 17, 2024 08:30 PM