శివాలయంలో అరుదైన 2 తలల పాము !! పూజారి ఏం చేశారంటే ??
పాము అంటే అందరికీ భయం. పాము అంటే కొందరికి భక్తి. పాముల్లో రకరకాల జాతులుంటాయి. అరుదైన పాముల జాతికి చెందిన వాటిలొ రెండు తలల పాము ఒకటి. ఈ పాము కోసం కొంత మంది రహస్యంగా అడవుల్లో పొలాల్లో వెతుకుతూ ఉంటారు. కారణం ఈ రెండు తలల పామును అమ్మి సొమ్ము చేసుకోవచ్చన్న దురాశ. ముఖ్యంగా స్మగ్లర్లు ఈ పాము కోసం విపరీతంగా అన్వేషణ జరుపుతుంటారు.
అలాంటి ఓ రెండు తలల పాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట లోని ఒక పూజారి ఇంటి సమీపంలో కనిపించింది. ఒక గ్లాస్ లో తల ఇరుక్కుని , గ్లాస్ నుండి బయటకు రాలేక ఇబ్బంది పడింది. అది చూసిన దమ్మపేట శివాలయం పూజారి మారుతి శర్మ చలించిపోయి గ్లాస్ లో ఇరుక్కున్న పామును బయటకు తీశారు. అసలేమాత్రం భయపడకుండా దానిని దగ్గరకు తీసుకుని ముద్దాడారు. దానితో ఆడుకునే ప్రయత్నం చేశారు. అయితే దానిని అక్కడే వదిలిస్తే ఎవరైనా దానిని ఎత్తుకెళ్ళి అమ్మేస్తారని పూజారి ఆందోళన చెందారు. అందుకే ఆ పామును స్థానిక ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. దాంతో ఆ రెండు తలల పామును ఫారెస్ట్ అధికారులు సురక్షితంగా అడవిలో వదిలిపెట్టారు. విషయం తెలిసిన స్థానికులు పూజారిని పొగడ్తలతో ముంచెత్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోలీసులా.. మాజాకా !! ఇది చూశాక కూడా స్పీడ్‌గా నడిపే దమ్ముందా ??
వామ్మో !! ఎంత పెద్ద ప్రమాదం పెళ్లికూతురికి రాసిపెట్టుంది… అందుకే !!
డ్రైవరన్నా.. ఇదేం పని ?? వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు
యముడు షార్ట్ బ్రేక్.. తీసుకున్నాడనుకుంటా !!
ఒరేయ్ ఎవర్రా మీరు ?? బిజినెస్ కోసం సల్మాన్ ఖాన్ ను ఇలా కూడా వాడేస్తారా ??
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

