తెలంగాణ సర్కారు సమగ్ర కుల సర్వేను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. అధికారుల దగ్గర ఎంతో భద్రంగా ఉండాల్సిన సర్వే దరఖాస్తు పత్రాలు మేడ్చల్ జిల్లాలో రోడ్డు పక్క దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మేడ్చల్ మునిసిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని దరఖాస్తులు పరిశీలించారు. భర్తీ చేయని ఖాళీ దరఖాస్తులో రోడ్డు పక్క పడి ఉన్నట్లు అధికారులు తెలిపారు.