Dandruff: తలలో చుండ్రు చికాకు పెడుతుందా.. ఇలా కంట్రోల్ చేస్తే సరి!

తలలో చుండ్రు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. చుండ్రు ఎక్కువగా ఉంటే చర్మ సమస్యలు కూడా వస్తాయి. చుండ్రు కొద్దిగా కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కంట్రోల్ చేసుకోవాలి..

Chinni Enni

|

Updated on: Nov 16, 2024 | 6:07 PM

ఇతర సీజనల్ కంటే చలికాలం కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చలికాలం కేవలం చర్మ సమస్యలే కాకుండా జుట్టు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎక్కువగా చుండ్రు సమస్య వేధిస్తూ ఉంటుంది. చుండ్రు ఒక్కసారి వచ్చిందంటే అంత త్వరగా వదలదు.

1 / 5
చుండ్రు కారణంగా జుట్టు కూడా పొడిబారిపోయి.. నిర్జీవంగా కనిపిస్తుంది. బయటకు వెళ్లాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. చుండ్రు నివారణకు ఇప్పటికే ఎన్నో రకాల హోమ్ రెమిడీస్ తెలుసుకున్నాం. తాజాగా మరికొన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
కలబంద, టీట్రీ ఆయిల్‌ కలిపి హెయిర్ ప్యాక్‌‌లా వేసుకోవచ్చు. వీటిల్లో ఫంగస్‌ను, బ్యాక్టీరియాను నిరోధించే గుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండిటినీ కలిపి ఉపయోగిస్తే చలికాలంలో వచ్చే చుండ్రు సమస్యలను ఈజీగా తగ్గించుకోవచ్చు.

3 / 5
కొబ్బరి నూనె, నిమ్మరసంతో కూడా చుండ్రు సమస్యకు పుల్ స్టాప్ పెట్టవచ్చు. ఈ రెండింటీని మిక్స్ చేసి.. తలకు పట్టిస్తే.. చుండ్రు తగ్గుతుంది. కేవలం పది నిమిషాలు ఉంచి తల స్నానం చేస్తే చాలు. ఇలా వారంలో రెండు, మూడు సార్లు మంచి ఫలితం కనిపిస్తుంది. జుట్టు కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది.

4 / 5
అరటి పండు, ఆలివ్ ఆయిల్ హెయిర్ ప్యాక్‌తో కూడా చుండ్రును తగ్గించుకోవచ్చు. అరటి పండు జుట్టును మెరిసేలా, హైడ్రేట్ చేస్తుంది. ఆలివ్ ఆయిల్ జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ఈ ప్యాక్ వేసి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే చాలు. 

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

అరటి పండు, ఆలివ్ ఆయిల్ హెయిర్ ప్యాక్‌తో కూడా చుండ్రును తగ్గించుకోవచ్చు. అరటి పండు జుట్టును మెరిసేలా, హైడ్రేట్ చేస్తుంది. ఆలివ్ ఆయిల్ జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ఈ ప్యాక్ వేసి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే చాలు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow us