అయ్యో.. హైదరాబాద్‌లో రాత్రికి రాత్రి బస్‌స్టాప్ మాయం !!
హైదరాబాద్ లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది..ఏకంగా బస్ స్టాప్ నే మాయం చేశారు కొందరు దుండగులు.ఆదివారం రోజు రాత్రి బస్‌స్టాప్‌ను ఎవరో ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం బస్ కోసం బస్ స్టాప్ కి వచ్చిన ప్రజలకు బస్ స్టాప్ కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. ఎవరో బస్ స్టాప్ ను పూర్తిగా ధ్వంసం చేసినట్లు గుర్తించారు. దీంతో చేసేది లేక బస్టాప్ కు పక్కనే ఎండలోనే నిల్చున్నారు.
ఈ ఘటన హబ్సిగూడ నాచారం మధ్యలో ఉన్న రోడ్డులో చోటుచేసుకుంది. హబ్సిగూడ ఎంజిఆర్ఐ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న బస్సు స్టాప్ రాత్రికి రాత్రి మాయమైపోయింది.. ఈ బస్ స్టాప్ కు పక్కనే ఒక నర్సరీ దుకాణం ఉంది. నర్సరీ నిర్వాహకులను సైతం ప్రజలు బస్ స్టాప్ గురించి అడిగారు. తమకు తెలియదు అని సమాధానం చెప్పడంతో అక్కడ ఉన్న పలువురు జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేశారు. జిహెచ్ఎంసి అధికారులు నుండి వివరణ కోరగా తాము ఈ ఘటనపై ఎంక్వయిరీ చేస్తున్నట్లు అధికారులు బదులిచ్చారు. అయితే బస్ స్టాప్ ను తాము కూల్చలేదు అని తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న జిహెచ్ఎంసి అధికారులు పక్కన ఉన్న నర్సరీ నిర్వాహకులను సైతం విచారించారు. వారి నుండి కూడా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో ఎవరో దుండగులు కావాలని బస్ స్టాప్ కి ఉన్న ఇనుమును దొంగలించే ప్రయత్నం చేశారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇనుము కోసం బస్ స్టాప్ కు ఉన్న రాడ్డులను ఎత్తుకెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెల్లారి లేచిన వెంటనే ఫోన్ చూస్తున్నారా ?? ఇది తెలిస్తే మీ గుండె గుభేల్ !!
ఆ రైలు.. ఆ రైతుదే !! ఈ కథ తెలుసా ??
Pushpa 02: సోషల్ మీడియాలో పుష్పరాజ్ అరాచకం..
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

