AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 02: సోషల్ మీడియాలో పుష్పరాజ్ అరాచకం..

Pushpa 02: సోషల్ మీడియాలో పుష్పరాజ్ అరాచకం..

Phani CH
|

Updated on: Nov 15, 2024 | 8:46 PM

Share

పుష్పరాజ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే పేరు. గత మూడేళ్ల క్రితం విడుదలైన పుష్ప పార్ట్ 1 ఏ రేంజ్ లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ మూవీతో పుష్పరాజ్ గా ఊరమాస్ నటనకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు అల్లు అర్జున్. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ మూవీలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు.

ఇక ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న పుష్ప 2 పై మరింత క్యూరియాసిటీ నెలకొంది. గతంలో పుష్ప.. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 400 కోట్ల రూపాయిలు వసూలు చేసింది. దీంతో ఇప్పుడు పుష్ప 2పై హైప్ ఎక్కువగానే ఉంది. మరోవైపు ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచుతూ మేకర్స్ కూడా ప్రమోషన్స్ షూరు చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నాడు బన్నీ. మరోవైపు సినిమా నుంచి ఒక్కో అప్డేట్ వస్తున్న కొద్దీ అవి మూవీ స్థాయిని పెంచుతున్నాయి. ఇక టీజర్ తోనే ఈసినిమా ఎలా ఉంటుందో ముందే చెప్పేశాడు సుకుమార్. గంగమ్మ తల్లి గెటప్ లో బన్నీ లుక్ అదిరింది. దీంతో ఈసారి పుష్ప 2.. బాహుబలి 2 రికార్డ్ ను బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా ఇటు సౌత్.. అటు నార్త్ లో రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సినిమా ట్రైలర్ రిలీజ్ కాకుండానే నెట్టింట ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ అయితే పరిస్థితి ఎలాంటి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 17న పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ట్రైలర్ పై దాదాపు నెల రోజులుగా వర్క్ చేస్తున్నారట సుకుమార్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇలా చేశారంటే.. ఎంత పెద్ద తోపులైనా ఏమీ చేయలేరు !!

మతిమరుపు మంచిదే.. మర్చిపోకుంటేనే డేంజర్‌… ఎందుకలా ??

రక్తం తాగి బతికే వాంపైర్‌ గబ్బిలాలపై ప్రయోగం.. ఎందుకలా ??

నా బ్రెయిన్‌‌లో మెషిన్ పెట్టారు.. డీ యాక్టివేట్‌ చేయండి !! ఏపీ టీచర్ వింత పిటిషన్‌

మహిళా కి”లేడీ”లు.. లోన్‌ పేరుతో భారీ దోపిడీ !!

Follow Us