నా బ్రెయిన్‌లో మెషిన్ పెట్టారు.. డీ యాక్టివేట్ చేయండి !! ఏపీ టీచర్ వింత పిటిషన్
తన మెదడును రిమోట్ సాయంతో కంట్రోల్ చేయడానికి కొందరు కుట్ర చేశారన్నది ఓ ఉపాధ్యాయుడి ఆరోపణ. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ టీచర్.. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. వాస్తవానికి దీనిపై మూడేళ్ల కిందటే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐ, ఫోరెన్సిక్ సైంటిఫిక్ ల్యాబొరేటరీలను ఉన్న న్యాయస్థానం ఆదేశించింది.
ఆ పిటిషన్ లో పేర్కొన్న అంశాలపై తమ అభిప్రాయాన్ని కూడా చెప్పాయి. దీంతో హైకోర్టు ఆ పిటిన్ ను కొట్టేసింది. చివరకు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. తన మెదడును కంట్రోల్ చేసేందుకు కొందరు మెషిన్‌ను పెట్టారని ఆరోపించిన ఆ ఉపాధ్యాయుడు.. దానిని డీ-యాక్టివేట్ చేయాలని కోరాడు. దీంతో ఈ పిటిషన్ కు ఎటువంటి విచారణార్హత లేదని జస్టిస్ సుధాన్షు ధూలియా, జస్టిస్ అహసుద్దీన్ అమనుల్లాహ్ ధర్మాసనం తిరస్కరించింది. అయితే కొంతమంది.. హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైంటిఫిక్ ల్యాబొరేటరీ నుంచి మానవ మెదడును నియంత్రించే మెషీన్‌ను తీసుకొచ్చి, తనపై ప్రయోగం చేశారని ఆరోపించాడు. ఆ మెషీన్‌ను డియాక్టివేట్ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. అఫిడ్‌విట్ దాఖలు చేయాలని సీబీఐ, సీఎఫ్ఎస్‌ఎల్‌కి నోటీసులు జారీచేసింది. తాము ఆ వ్యక్తిపై ఎటువంటి ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయలేదని, అలాంటప్పుడు దాన్ని డీ-యాక్టివేట్ చేసే ప్రశ్నే ఉండదని CFSL అఫిడ్‌విట్‌లో పేర్కొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళా కి”లేడీ”లు.. లోన్ పేరుతో భారీ దోపిడీ !!
వారెవా !! సోలార్ పవర్ కోసం స్పేస్ కే స్కెచ్చేసిన సైంటిస్టులు
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

