వారెవా !! సోలార్ పవర్ కోసం స్పేస్ కే స్కెచ్చేసిన సైంటిస్టులు
సౌర విద్యుత్ ఉత్పత్తిలో సరికొత్త ముందడుగు పడనుంది. ఇప్పటివరకు భూమిపైన సౌరఫలకాలను ఏర్పాటు చేసి సూర్య కిరణాలను గ్రహించి, విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. ఇక మీదట అంతరిక్షం నుంచే విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఈ దిశగా యూకేకు చెందిన స్పేస్ సోలార్ అనే అంకుర సంస్థ, ఐస్‌లాండ్ దేశానికి చెందిన విద్యుత్తు ఉత్పత్తి సంస్థ రేక్‌జావిక్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
2030 నాటికి 30 మెగావాట్ల అంతరిక్ష ఆధారిత సౌర విద్యుత్తు కేంద్రాన్ని ప్రారంభించాలనేది ఈ ఒప్పంద లక్ష్యం. సౌర విద్యుత్తు స్వచ్ఛమైనదే, పర్యావరణహితమైనదే అయినప్పటికీ ఉత్పత్తిలో పలు సమస్యలు ఉంటాయి. వాతావరణం ప్రతికూలంగా ఉండి, మేఘాలు ఏర్పడినప్పుడు సౌర విద్యుత్తు ఉత్పత్తి వీలు కాదు. ఈ సమస్యకు పరిష్కారంగా అంతరిక్ష ఆధారిత సౌర విద్యుత్తు కేంద్రాలను నిర్మించాలనే ప్రతిపాదన 1970ల నుంచి ఉంది. ఇంతకాలం ఆచరణసాధ్యం కాదని భావిస్తున్నా.. ఇప్పుడు స్పేస్ సోలార్, రేక్‌జావిక్ ఎనర్జీ ఈ విషయంలో ముందడుగు వేస్తున్నాయి. భూమికి 35,786 కిలోమీటర్ల దూరంలో జియోసింక్రోనస్ కక్ష్యలో ముందుగా ఫోటోవాల్టేయిక్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటుచేస్తారు. గాలి, మేఘాలు, ధూళి వంటి ఆటంకాలు లేకుండా నేరుగా ఇవి సూర్య కిరణాలను గ్రహించి విద్యుత్తుగా మారుస్తాయి. విద్యుత్తును సూక్ష్మ తరంగాలుగా మార్చి భూమి మీదకు పంపిస్తాయి. భూమి మీద ఏర్పాటు చేసిన రిసీవర్లు ఈ సూక్ష్మ తరంగాలను మళ్లీ విద్యుత్తుగా మార్చి గ్రిడ్లకు పంపిస్తాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జిల్ బైడెన్ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్ సతీమణి.. కారణం ఇదేనా ??
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్ విలువ ఇన్ని లక్షలా ??
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు.. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
ఇంటి పనుల్లో బిజీగా కుటుంబ సభ్యులు.. ఇంతలో ఊహించని సీన్ !!
మేఘాల్లో కలిసిపోతున్న మైక్రోప్లాస్టిక్స్ !! ఊహించని ఉత్పాతం తప్పదా ??
అర్థరాత్రి రైడ్‌తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే
గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..
వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు
ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

