కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు.. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటన కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసు మొత్తంలో కోల్‌కతా మాజీ పోలీస్ కమీషనర్ వినీత్ గోయల్ కుట్ర అని ఆరోపించాడు. ఈ కేసులో తనను ఇరికించారని పేర్కొన్నాడు. సంజయ్ రాయ్‌ని సీల్దా కోర్టు నుంచి పోలీసు వ్యానులో తీసుకెళుతున్న సమయంలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘‘ ఈ కుట్ర అంతా వినీత్ గోయల్‌దే. నన్ను ఇరికించాడని నేను మీకు చెబుతున్నాను’’ అని సంజయ్ రాయ్ అన్నాడు. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం అతడిని పోలీసులు సీల్డా కోర్టుకు తరలించారు. జిల్లా అడిషనల్, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ విచారణ జరిపారు. కేసుతో సంబంధం లేని వారిని అనుమతించకుండా, ఈ విచారణను కోర్టు గది తలుపులు మూసి ఉంచి నిర్వహించారు. కాగా భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64, సెక్షన్ 66తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ అనే ప్రభుత్వ హాస్పిటల్‌లో కొన్నాళ్ల కిందట రాత్రి డ్యూటీలో ఉన్న ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగింది. నిందితుడు సంజయ్ రాయ్‌ని ఆగస్టు 10న పోలీసులు అరెస్టు చేశారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసు దర్యాప్తును చేపట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటి పనుల్లో బిజీగా కుటుంబ సభ్యులు.. ఇంతలో ఊహించని సీన్ !!
మేఘాల్లో కలిసిపోతున్న మైక్రోప్లాస్టిక్స్ !! ఊహించని ఉత్పాతం తప్పదా ??
చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ?? ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

