ఇంటి పనుల్లో బిజీగా కుటుంబ సభ్యులు.. ఇంతలో ఊహించని సీన్ !!
అటవీ ప్రాంతంలో ఉండాల్సిన కొండచిలువ ఒక్కసారిగా ఇంట్లో ప్రత్యక్షం కావడంతో భయంతో వణికిపోయారు. ఇంట్లో వింత శబ్దం రావడంతో ఏదో వస్తువు అనుకున్నారు.. దగ్గరికి వెళ్లి చూస్తే.. భారీ కొండ చిలువ. అసలు కథ అప్పుడే మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బైపాస్ వద్ద ఉన్న గంట కుశయ్య గౌడ్ ఇంట్లో కొండచిలువ కలకలం సృష్టించింది.
ఉదయం పూట ఇంట్లో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా.. ఇంట్లోని ఒక మూలనుంచి వింత శబ్దాలు రావడంతో అటువైపు వెళ్లిన కుషయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అక్క ఓ భారీ కొండచిలువ కనబడంతో ఒక్క ఉదుటన బయటకు పరుగెత్తాడు. చుట్టుపక్కల వారికి విషయం చెప్పడంతో వారంతా అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో చొరబడిన కొండ చిలువను చూసి వారంతా షాకయ్యారు. కొందరు గ్రామస్తులు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఆ కొండచిలువను చాకచక్యంగా బంధించాడు. ఈ క్రమంలో అతన్ని ముప్పు తిప్పలు పెట్టింది ఆ కొండచిలువ. ఎట్టకేలకు దానిని బంధించి అటవీ ప్రాంతం లో వదిలిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మేఘాల్లో కలిసిపోతున్న మైక్రోప్లాస్టిక్స్ !! ఊహించని ఉత్పాతం తప్పదా ??
చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ?? ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

