చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!

చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!

Phani CH

|

Updated on: Nov 14, 2024 | 9:44 PM

అనకాపల్లి జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కదలికలు లేకుండా పుట్టిన ఓ శిశువు మృతిచెందిందని వైద్యులు చెప్పగా అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆ శిశువులో కదలికలు రావడంతో మళ్లీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

శిశువు తండ్రి తెలిపిన వివరాలు ప్రకారం.. చీడికాడ మండలం కండివరం గ్రామానికి చెందిన రమ్య గర్భిణి. ప్రసవం కోసం కేజీహెచ్ లో చేరింది. రమ్య ఆరోగ్యం సహకరించకపోవడంతో 25 వారాలకే ప్రీ మెచ్యూర్ బేబీకి జన్మనిచ్చింది. శనివారం ఉదయం నాలుగు గంటలకు మగ బిడ్డ పుట్టాడు. కేవలం 912 గ్రాముల బరువుతో పుట్టిన ఆ శిశువుకు అవసరమైన వైద్య సేవలు అందించారు. అయితే ఆ ఆనందం ఎంతోసేపు లేదు ఆ కుటుంబానికి. ఎందుకంటే పుట్టిన ఆ శిశువులో చలనం లేదు. వైద్యులు గంటలపాటు శిశువును బ్రతికించేందుకు శ్రమించారు.. చివరకు 6 గంటల అబ్జర్వేషన్ తర్వాత బిడ్డకు ఊపిరి ఆగిపోయిందని పేరెంట్స్‌కు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రి సిబ్బంది సైతం అదే అంశాన్ని ఆస్పత్రి రికార్డ్స్‌లో ఎంట్రీ చేశారు. ఆ తరువాత శిశువును తండ్రికి అప్పగించారు. దీంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది ఆ కుటుంబం. శిశువుకు అంత్యక్రియలు జరిపించేందుకు ఆ తండ్రి బరువెక్కిన గుండె తో ఇంటికి బయలు దేరాడు. అంబులెన్స్‌లో కూర్చున్న తరువాత ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఒడిలో ఉన్నశిశువులో కదలికలు వచ్చాయి. అది గమనించిన తండ్రి.. హుటాహుటిన శిశువును వైద్యుల వద్దకు తీసుకెళ్లాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!

క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ?? ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం

Published on: Nov 14, 2024 08:48 PM