Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!

కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!

Phani CH

|

Updated on: Nov 14, 2024 | 8:47 PM

కార్తీక మాసం శుభవేళ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఓ ఆలయ సమీపంలోని కొబ్బరి చెట్టులో శివలింగం ప్రత్యక్షమైంది. కార్తీక సోమవారం స్వయంగా పరమశివుడే ఇలా దర్శనమిచ్చాడని పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని పూజలు చేశారు. అయితే అక్కడ శివలింగం నిజంగా వెలిసిందా? లేక ఎవరైనా అక్కడ అలా పెట్టారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో కొబ్బరి చెట్టు మొదలులో సూక్ష్మ శివలింగం కనిపించడంతో భక్తులు పూజలు చేయడానికి క్యూ కట్టారు, కార్తీక మాసం పర్వదినంలో స్వయంగా శివుడే ప్రత్యక్షమయ్యాడంటూ పూజలు చేశారు. కార్తీక సోమవారం శివునికి ప్రీతికరమైన రోజున పంచలోహాలతో కూడిన సూక్ష్మ శివలింగం బయటపడడం తో స్థానికులు, చట్టుపక్కల ప్రాంతాలవారు అక్కడికి క్యూ కట్టారు. పి.గన్నవరం బొడపాటివారిపాలెం వద్ద ప్రధాన రహదారి చెంతనే ఉన్న కొండాలమ్మ, శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాలు వెనుక భాగంలో ఉన్న కొబ్బరి చెట్టు వద్ద శివలింగం కనిపించింది. స్వప్న అనే భక్తురాలు వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవుని దర్శించుకుని, బయటకు వస్తున్న సమయంలో నల్లత్రాచు పాము కనబడింది. అది ఎటు వెళ్తుందోనని ఆందోళన చెందిన ఆమె స్థానికులకు చెబుదామని ప్రయత్నించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ?? ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం