జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి.. కారణం ఇదేనా ??

జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి.. కారణం ఇదేనా ??

Phani CH

|

Updated on: Nov 14, 2024 | 9:50 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించారు. త్వరలో రెండోసారి అగ్రరాజ్యం అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు ట్రంప్‌. ఈ క్రమంలో అధికార మార్పిడి నేపథ్యంలో వైట్‌హౌస్‌లో జరగనున్న సంప్రదాయబద్ధమైన సమావేశానికి ట్రంప్‌ సతీమణి మెలానియా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అధ్యక్షుడు జో బైడెన్‌ బాధ్యతల నుంచి వైదొలుగుతున్న నేపథ్యంలో నవంబరు 13న ఓవల్‌ ఆఫీసులో డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఫస్ట్‌ లేడీ టీ పార్టీ ఇవ్వడం ఆనవాయితీ. దీనికి సంబంధించిన ఆహ్వానాన్ని జిల్ బైడెన్‌ గత వారమే మెలానియా ట్రంప్‌నకు పంపినట్లు వైట్‌హౌస్‌ వెల్లడించింది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించిన సందర్భంలో అప్పటి ఫస్ట్‌ లేడీగా ఉన్న మిచెల్‌ ఒబామా మెలానియాకు టీ పార్టీ ఇచ్చారు. ఆ తర్వాత 2020 ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ట్రంప్‌ ఆరోపించారు. ఈనేపథ్యంలో అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌, ట్రంప్‌ భేటీ కావాల్సి ఉన్నా కాలేదు. దీంతో ఈ ఆనవాయితీకి బ్రేక్‌ పడింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలిచిన ట్రంప్‌నకు శాంతియుతంగా అధికార మార్పిడికి సిద్ధంగా ఉన్నట్లు బైడెన్‌ తెలిపారు. ఈక్రమంలో ప్రస్తుత ఫస్ట్‌ లేడీగా ఉన్న జిల్‌ బైడెన్‌ ఇవ్వనున్న టీ పార్టీకి మెలానియా దూరంగా ఉండటం గమనార్హం.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??

కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు.. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు

ఇంటి పనుల్లో బిజీగా కుటుంబ సభ్యులు.. ఇంతలో ఊహించని సీన్‌ !!

మేఘాల్లో కలిసిపోతున్న మైక్రోప్లాస్టిక్స్‌ !! ఊహించని ఉత్పాతం తప్పదా ??

చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!