దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??

దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??

Phani CH

|

Updated on: Nov 14, 2024 | 9:48 PM

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించడంతో క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ జోరు మీదుంది. క్రిప్టోకరెన్సీలకు అనుకూలంగా ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాలు ఉండొచ్చన్న అంచనాలతో దీని విలువ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో బిట్‌కాయిన్‌ విలువ చరిత్రలోనే తొలిసారిగా 90వేల డాలర్లకు చేరువగా వచ్చింది.

ఈ భూమ్మీద ఎక్కడా లేని విధంగా అమెరికాను క్రిప్టో రాజధానిగా మారుస్తానంటూ కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ప్రకటించారు. దీంతో మార్కెట్లలో ఈ కాయిన్‌ ర్యాలీ కొనసాగింది. మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో దీని విలువ 89,637 డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.75 లక్షల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. ఇదే ఉత్సాహం కొనసాగితే ఈ ఏడాది చివరికి బిట్‌కాయిన్‌ విలువ లక్ష డాలర్లను దాటొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత నుంచి ఈ క్రిప్టో కరెన్సీ విలువ 30 శాతం పైనే పెరిగింది. త్వరలో అగ్రరాజ్యంలో వడ్డీరేట్లు మరింత తగ్గొచ్చనే సంకేతాలు కూడా తాజా ర్యాలీకి దోహదం చేస్తున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు.. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు

ఇంటి పనుల్లో బిజీగా కుటుంబ సభ్యులు.. ఇంతలో ఊహించని సీన్‌ !!

మేఘాల్లో కలిసిపోతున్న మైక్రోప్లాస్టిక్స్‌ !! ఊహించని ఉత్పాతం తప్పదా ??

చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!

కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!