అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్ న్యూస్.! ఇండియన్స్ కి మరింత కష్టం.
విహారయాత్రకో లేక వ్యాపార పర్యటన కోసమో అమెరికా వెళ్లాలనుకుంటున్నారా? అందుకు అవసరమైన వీసా కోసం కోల్‌కతాలోని అమెరికా కాన్సులేట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారా? అయితే అపాయింట్మెంట్ కోసం కనీసం 16 నెలలపాటు వేచిచూసేందుకు మీరు సిద్ధం కావాల్సిందే. వీసా నిరీక్షణ సమయాలు విపరీతంగా పెరిగిపోవడంతో నిరీక్షించక తప్పదు.
వెయిటింగ్ టైమ్‌ను తగ్గించేందుకు గత ఏడాది కాలంగా అమెరికా పలు చర్యలు చేపట్టడంతో పరిస్థితి కొంత మేర మెరుగుపడింది. ముఖ్యంగా గతేడాది భారతీయ దరఖాస్తుదారుల కోసం ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిలో 14 లక్షల వీసాలను ప్రాసెస్ చేయడంతోపాటు విజిటర్ వీసా అపాయింట్మెంట్ టైమ్‌ను 75% మేరకు తగ్గించగలిగారు. అయినప్పటికీ అమెరికా వీసాల కోసం సుదీర్ఘ కాలంపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి మళ్లీ తలెత్తింది. ప్రస్తుతం బీ1/బీ2 వీసాల కోసం భారత్‌లోని అమెరికా కాన్సులేట్లలో నిరీక్షణ సమయం ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంది.
కోల్‌కతాలో అత్యధింగా 499 రోజులపాటు నిరీక్షించాల్సి వస్తుండగా.. చెన్నైలో 486 రోజులు, హైదరాబాద్‌లో 435 రోజులు, ఢిల్లీలో 432 రోజులు, ముంబై 427 రోజులు పడుతోంది. ఒకవేళ మీరు థర్డ్ కంట్రీ నేషనల్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పరిస్థితి దాదాపు ఇలాగే ఉంటుంది. అపాయింట్మెంట్ కోసం అబూదాబీలో 332 రోజులు, దుబాయ్‌లో 289 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది. స్వదేశంలో కాకుండా వేరే దేశంలోని అమెరికా కాన్సులేట్ నుంచి పొందే వీసాను థర్డ్ కంట్రీ నేషనల్ వీసా అంటారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్

