మహిళా కి”లేడీ”లు.. లోన్ పేరుతో భారీ దోపిడీ !!
ఈ రోజుల్లో అందరికీ డబ్బు అవసరమే. దానినే మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. బ్యాంకులో లోన్‌లు ఇప్పిస్తామని వేలాదిమంది వద్ద ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి పత్తా లేకుండా పోయిన కిలాడి గ్యాంగ్ ఉదంతం బయటపడింది. బాధితులు బెంగళూరులోని పోలీసులకు ఫిర్యాదు చేయగా, రేష్మా అనే మహిళను అరెస్టు చేశారు.
ఈ కేసులో ఆనంద్, రేష్మా, అంజుం, అనియా అనే నలుగురు వ్యక్తులు ఉన్నారని పోలీసులు తెలిపారు. బెంగళూరులో మహిళా గ్యాంగ్ మోసపూరిత దందా బయటపడింది. బ్యాంకులో లోన్‌లు ఇప్పిస్తామని వేలాదిమంది వద్ద ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి పత్తా లేకుండా పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీకర కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంకు పేరిట దొంగ బ్యాంక్‌ను సృష్టించి వ్యాపారం పెట్టుకోవడానికి రూ. 1 లక్ష నుంచి 25 లక్షల వరకు సులభంగా లోన్లు ఇప్పిస్తామని ఈ ముఠా ప్రచారం చేసుకుంది. దీంతో అనేక మంది గృహిణులు వీరి బుట్టలో పడిపోయారు. లోన్ ప్రాసెసింగ్ ఫీజులని చెప్పి బాధితుల దగ్గర 3 వేల నుంచి 5 వేల వరకు.. అలా లక్షల రూపాయలను వసూలు చేశారు. కానీ అప్పు మాత్రం ఇప్పించలేదు. ప్రాసెసింగ్ ఫీజు డబ్బులు వెనక్కి ఇవ్వాలని అడిగితే అడ్రస్ లేకుండా పోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వారెవా !! సోలార్ పవర్ కోసం స్పేస్ కే స్కెచ్చేసిన సైంటిస్టులు