Srikakulam: అడవి పందుల నుంచి రక్షణ కోసం వల పెట్టారు.. అందులో చిక్కింది చూస్తే

Srikakulam: అడవి పందుల నుంచి రక్షణ కోసం వల పెట్టారు.. అందులో చిక్కింది చూస్తే

S Srinivasa Rao

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 15, 2024 | 7:34 PM

పల్లెటూర్లలో కొన్నిసార్లు విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. అడవి పందుల నుంచి పొలాలకు రక్షణ కోసం వల పెడితే అందులో వింత జీవులు చిక్కిన ఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం, డోంకురు గ్రామంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. గురువారం రాత్రి గ్రామానికి చెందిన సంగారు, గంగయ్య, బుడగొట్లు… పొలంకు అడవి పందుల నుండి రక్షణకు వల పెట్టగా.. దానికి భారీ కొండచిలువ చిక్కింది. ఉదయం పొలానికి వచ్చిన రైతులు వలలో ఇరుక్కుపోయి ఉన్న భారీ కొండచిలువను చూసి ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అనంతరం దానిని గ్రామంలోకి తీసుకువచ్చి అనంతరం శివారు ప్రాంతంలో విడిచిపెట్టారు. కొండచిలువ సుమారు 6 అడుగుల పొడువు ఉంది. ఇంత భారీ పొడవుగల కొండచిలువ కంటబడడంతో స్థానికులు కొండచిలువను చూసేందుకు ఎగబడ్డారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి