Watch: వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
నిర్మల్ జిల్లాలో గత 20 రోజులుగా సంచరిస్తున్న బెబ్బులి.. నర్సాపూర్, మామడ, పెంబి రేంజ్ లు దాటుకుంటూ కవ్వాల్ అభయారణ్యం వైపు అడుగులు వేస్తోంది. సంచారంలో ఎదురు పడుతున్న పశువుల మందలపై దాడి చేస్తూ ఆవు లు , గేదేలను హతమారుస్తోంది. 20 రోజుల వ్యవధిలో 8 పశువులను హతమార్చింది బెబ్బులి. ఆడ తోడు కోసం ప్రయాణం చేస్తున్న ఆరున్నరేళ్ల పగ పులి గుర్తించింది అటవిశాఖ.
మహారాష్ట్ర సరిహద్దుకిన్వట్ అభయారణ్యం లోని అప్పారావు పేట్ రేంజ్ నుండి సహ్యాద్రి పర్వత శ్రేణునుదాటుతూ పెంబి అటవి ప్రాంతంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బెబ్బులి. అయితే ఇప్పుడు ఆ పులి ఇదేనంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. గంభీరంగా అభయారణ్యంలో అడుగులు వేస్తూ కొండలు గుట్టలు ఎక్కుతూ ముందుకు సాగుతున్న ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని పెంబితాండాలో పెద్దపులి సంచరిస్తుందని.. అదిగో ఆ పులి ఇదే అంటూ ఓ వీడియోను చూపిస్తున్నారు నెటిజన్స్. అడుగుల కోసం వెతుకుతున్న ఫారెస్ట్ అధికారులు పెంబి గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరు కూడా అడవి వైపు వెళ్ళకూడదని రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్త ఉండాలని ఒకరిద్దరు కాకుండా గుంపుగా వెళ్లాలని హెచ్చరిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.