AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రగ్స్‌ తీసుకుని బరిలోకి.. 11 బంతుల్లో 30 పరుగులు, ఆపై 2 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. కట్‌చేస్తే.. ఊహించని షాక్

New Zealand Doug Bracewell: క్రికెట్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. టీ20 మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ ఆటగాడు కొకైన్ సేవించి తన ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను కేవలం 11 బంతుల్లో 30 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. అలాగే, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

డ్రగ్స్‌ తీసుకుని బరిలోకి.. 11 బంతుల్లో 30 పరుగులు, ఆపై 2 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. కట్‌చేస్తే.. ఊహించని షాక్
New Zealand Doug Bracewell
Venkata Chari
|

Updated on: Nov 18, 2024 | 11:02 AM

Share

ఒలింపిక్స్ వంటి పెద్ద ఈవెంట్లలో తమ ప్రదర్శనను మెరుగుపరుచుకోవడానికి అథ్లెట్లు డ్రగ్స్ వాడటం గురించిన వార్తలు అప్పుడప్పుడు మన వింటూనే ఉంటాం. అయితే ఇప్పుడు క్రికెట్‌లో ఇలాంటి షాకింగ్ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక న్యూజిలాండ్ క్రికెటర్ మ్యాచ్‌కు ముందు కొకైన్ ప్రభావంతో మైదానంలోకి వచ్చి, అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అలాగే, ఆ తర్వాత తన తుఫాన్ బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. అయితే, మ్యాచ్ తర్వాత అతన్ని పరీక్షించినప్పుడు, అతను పాజిటివ్ అని తేలాడు. దీంతో అతనిపై ఒక నెల నిషేధం కూడా విధించారు.

కొకైన్ తీసుకుని, ఇరగదీసిని ఆల్ రౌండర్..

వాస్తవానికి, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ డగ్ బ్రేస్‌వెల్ ఈ ఏడాది జనవరిలో దేశవాళీ టీ20 మ్యాచ్ ఆడాడు. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ తరపున ఆడిన 34 ఏళ్ల బ్రేస్‌వెల్ వెల్లింగ్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో కొకైన్ మత్తులో ఉన్నాడని స్పోర్ట్స్ ఇంటెగ్రిటీ కమిషన్ వెల్లడించింది. మద్యం మత్తులో ఆ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. టాస్ గెలిచిన వెల్లింగ్టన్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అతనికి వ్యతిరేకంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు, బ్రేస్‌వెల్ 4 ఓవర్లలో కేవలం 21 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

మొదట బ్యాటింగ్ చేసిన వెల్లింగ్టన్ 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, దానిని ఛేదించే సమయంలో బ్రేస్‌వెల్ 11 బంతుల్లో అజేయంగా 30 పరుగులు చేశాడు. ఈ చిన్న ఇన్నింగ్స్‌లో అతను 4 సిక్సర్లు బాదాడు. దీంతో పాటు మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు కూడా అందుకున్నాడు. ఈ తుఫాన్ ప్రదర్శన కారణంగా సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ జట్టు 19 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో సులువుగా విజయం సాధించింది. ఆ తర్వాత బ్రేస్‌వెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

ఇవి కూడా చదవండి

1 నెల పాటు నిషేధం..

మ్యాచ్ ముగిసిన తర్వాత అతడిని పరీక్షించగా పాజిటివ్‌గా తేలాడు. దీంతో నిబంధనల ప్రకారం ఈ ఆల్ రౌండర్‌పై నిషేధం విధించారు. బ్రేస్‌వెల్ కొకైన్ సేవించినట్లు అతని బృందం కూడా అంగీకరించింది. అయితే జట్టుకు, మ్యాచ్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఫుల్‌గా మద్యం మత్తులో ఉన్నాడంట.. అయినప్పటికీ, బ్రేస్‌వెల్ చికిత్సలో పాల్గొన్నాడు. ఆ తర్వాత అతని శిక్ష ఒక నెలకు తగ్గించారంట.

ఏప్రిల్ 2024 నాటి మాదకద్రవ్యాల దుర్వినియోగానికి బ్రేస్‌వెల్‌కు ఒక నెల శిక్ష విధించారు. అతను మార్చి 2024లో తన చివరి హోమ్ మ్యాచ్ ఆడాడు. రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్‌తో శిక్ష విధించడంతో, అతని సస్పెన్షన్ పూర్తయింది. అతను మరోసారి క్రికెట్‌లో పాల్గొనవచ్చని తీర్పు ఇచ్చింది.

మరిన్న క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..