- Telugu News Photo Gallery Yoga during pollution: yoga asanas and pranayama to prevent respiratory problems amid air pollution
Yoga Benefits: ఈ సీజన్ లో ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం రోజూ ఈ యోగాసనాలు బెస్ట్ మెడిసిన్..
గాలిలో కాలుష్యం స్థాయి బాగా పెరిగి శ్వాసకోశ వ్యవస్థపై కాలుష్య ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఎక్కువ మందిలో శ్వాసకోశ సమస్యలు మొదలవుతున్నాయి. అటువంటి పరిస్థితిలో అవసరం లేకుండా బయటకు వెళ్లడం మానుకోవాలి. ఆరోగ్యంగా ఉండటానికి ఇంట్లో ప్రతిరోజూ యోగా, ప్రాణాయామం చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Updated on: Nov 18, 2024 | 7:35 PM

రోజూ భుజంగాసనం వేయడం వల్ల ఊపిరితిత్తులకు, శ్వాసకోశ వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. ఇది ఛాతీ కండరాలను విస్తరిస్తుంది. ఊపిరితిత్తులను బలపరుస్తుంది. ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అందువల్ల కాలుష్య సమయంలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ యోగా ఆసనాన్ని చేయండి.

గోముఖాసనాన్ని ప్రతిరోజూ సాధన చేస్తే.. ఈ యోగాసనం శ్వాసకోశ పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఈ యోగా వేయడం వలన శరీర భంగిమ కూడా మెరుగుపడుతుంది. వెన్నెముక, భుజాలు, వెన్ను నొప్పి నుంచి ఉపశమనం ఇవ్వడంలో ఈ నొప్పిని తగ్గించడంలో గోముఖాసనం సహాయపడుతుంది.

అర్ధ మత్స్యేంద్రాసనను అభ్యసించడం వల్ల శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే అర్ధ మత్యేంద్రాసన బ్రోన్కైటిస్ సమస్యల నుంచి ఉపశమనం ఇవ్వడంలో మంచి ప్రయోజనకారి. అంటే శ్వాసకోశ నాళాలలో వాపు, దీని కారణంగా బాగా శ్వాస తీసుకోగలుగుతారు. అంతేకాదు ఈ యోగాసనం శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. నిద్ర సరళిని మెరుగుపరుస్తుంది.

గాలిలో కరిగిన కాలుష్యాన్ని నివారించడానికి శరీరంలో ఆక్సిజన్ మెరుగైన ప్రవాహాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం. దీని కోసం ప్రాణాయామం చేయడం చాలా మంచిది. అనులోమ విలోమ అటువంటి ప్రాణాయామం మంచి మెడిసిన్. ఇది చేయడం చాలా కష్టం కాదు. దీని అభ్యాసం చేయడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ సరఫరాను పెంచడమే కాకుండా రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఈ ప్రాణాయామం సైనస్ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

శ్వాసకోశ సమస్యలను నివారించడానికి భస్త్రికా కూడా ఒక అద్భుతమైన ప్రాణాయామం. దీని అభ్యాసం బ్రోన్కైటిస్, సైనస్, ఇతర శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈ ప్రాణాయామం మూడు దోషాలను తగ్గించడంలో సహాయపడుతుంది. కఫ, వాత, పిత్త దోషాల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఇలా రోజూ చేయడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ కూడా తొలగిపోతాయి.




