- Telugu News Photo Gallery Business photos Indian Railways: Can You Transfer your Train Ticket to Another Person? Know Indian Railways Rule
Indian Railways: మీ రైలు టికెట్‌పై మరొకరు ప్రయాణించవచ్చా? రైల్వే నిబంధనలు ఏంటి?
Indian Railways: రైలు ప్రయాణం చేయాలంటే ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. రిజర్వేషన్ చేసుకోకుండా సాధారణ టికెట్ తీసుకుని ప్రయాణిస్తే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అయితే మీ కన్ఫర్మ్ అయిన టికెట్ మరొకరు ప్రయాణించవచ్చా? నిబంధనలు ఏంటి?
Updated on: Nov 18, 2024 | 6:56 PM


భారతీయ రైల్వేలో చాలా మందికి తెలియని నియమాలు ఉన్నాయి. మీరు రైలు టిక్కెట్‌ను బుక్ చేసి ఉంటే, చివరి నిమిషంలో ఏదైనా కారణం వల్ల ప్రయాణ ప్రణాళిక రద్దు అయితే మీరు నేరుగా టిక్కెట్‌ను రద్దు చేయడానికి బదులుగా టిక్కెట్‌ను బదిలీ చేయవచ్చు. దీని కోసం అదనపు ఖర్చు అవసరం లేదు.

టికెట్ రద్దుపై కనీస రద్దు ఛార్జీ చెల్లించాలి. టికెట్ బదిలీకి ఆ ఛార్జీ ఉండదు. కానీ కన్ఫర్మ్ అయిన టిక్కెట్లను మాత్రమే బదిలీ చేయవచ్చని గుర్తుంచుకోండి. వెయిటింగ్ లేదా RAC టిక్కెట్లు బదిలీ చేసేందుకు అవకాశం ఉండదు.

టిక్కెట్లను ఎలా బదిలీ చేయాలి?: టికెట్ బదిలీ కోసం మీరు టికెట్ ప్రింటౌట్, మీరు టిక్కెట్‌ను బదిలీ చేస్తున్న వ్యక్తి గుర్తింపు కార్డును రైల్వే కౌంటర్‌లో సమర్పించాలి. అప్పుడే టిక్కెట్టు బదిలీ అవుతుంది. ఒక వేళ ఆన్‌లైన్‌లో టికెట్ కొనుగోలు చేసినా రైల్వే కౌంటర్‌లో టికెట్ బదిలీ చేయాల్సి ఉంటుంది.

అయితే ఈ టికెట్ బదిలీ కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరుగుతుంది. అంటే, మీరు మీ భార్య, తల్లిదండ్రులు, సోదరుడు-సోదరి లేదా కొడుకు-కుమార్తె ఇలా మీ బంధువుల పేరు మీద బదిలీ చేయవచ్చు.





























