Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: నాలుగు రోజుల తర్వాత మళ్లీ పరుగులు.. భారీగా పెరిగిన బంగారం ధర

Gold Price: వార్తా సంస్థ PTI ప్రకారం, MCXలో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో డిసెంబర్ డెలివరీ కోసం బంగారం కాంట్రాక్టులు రూ. 621 లేదా 0.84 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.74,567 వద్ద ట్రేడయ్యాయి. ఎక్స్ఛేంజ్‌లో 10 గ్రాముల విలువైన మెటల్..

Gold Price: నాలుగు రోజుల తర్వాత మళ్లీ పరుగులు.. భారీగా పెరిగిన బంగారం ధర
Follow us
Subhash Goud

|

Updated on: Nov 18, 2024 | 7:45 PM

బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. నాలుగు రోజుల క్షీణత తర్వాత సోమవారం బంగారం ధరలో పెరుగుదల నమోదైంది. దేశీయంగా గోల్డ్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.660 వరకు పెరిగింది. ప్రస్తుతం అంటే నవంబర్‌ 18న రాత్రి 7 గంటల సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.69,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.76,650ఉంది. గురువారం నాడు ఈ విలువైన మెటల్ 10 గ్రాములకు రూ.77,050 వద్ద ముగిసింది. వెండి కూడా కిలోకు రూ.1,810 పెరిగి రూ.92,000కి చేరుకోగా, గురువారం కిలో ధర రూ.90,190 వద్ద ముగిసింది. ప్రస్తుతం కిలో వెండి రూ.89,500 ఉంటే కొన్ని ప్రాంతాల్లో రూ.99,000 ఉంది.

ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం.. గ్లోబల్‌గా బంగారానికి బలమైన ట్రెండ్‌, పెళ్లిళ్ల సీజన్‌లో నగల వ్యాపారులు, రిటైలర్‌ల నుంచి డిమాండ్‌ కూడా బంగారం ధరలపై ప్రభావం చూపిందని వ్యాపారులు తెలిపారు. గురునానక్ జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక బులియన్ మార్కెట్లు మూతపడ్డాయి.

మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు..?

వార్తా సంస్థ PTI ప్రకారం, MCXలో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో డిసెంబర్ డెలివరీ కోసం బంగారం కాంట్రాక్టులు రూ. 621 లేదా 0.84 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.74,567 వద్ద ట్రేడయ్యాయి. ఎక్స్ఛేంజ్‌లో 10 గ్రాముల విలువైన మెటల్ రూ.732 లేదా 0.99 శాతం పెరిగి రూ.74,678కి చేరుకుంది. రష్యా -ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా బంగారంలో బలమైన పెరుగుదల ఉందని ఎల్‌కెపి సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ విపి రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది అన్నారు.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ డెలివరీ కోసం వెండి కాంట్రాక్టులు కూడా కిలోకు రూ.879 లేదా 0.99 శాతం పెరిగి రూ.89,300కి చేరాయి. ఆసియా ట్రేడింగ్ అవర్స్‌లో, కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు $25.20 లేదా 0.98 శాతం పెరిగి ఔన్స్ $2,595.30 వద్ద ఉంది. కమోడిటీస్, మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలంత్రి ప్రకారం, బంగారం, వెండి ధరలు గత వారం పతనం కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో రెండు నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత బిట్‌కాయిన్, యుఎస్ డాలర్ బలమైన పనితీరు కారణంగా ఈ క్షీణత ప్రధానంగా ఉందని, ఇది విలువైన మెటల్ సురక్షితమైన పెట్టుబడి ఆకర్షణను తగ్గించిందని కలంత్రి చెప్పారు.

ఇది కూడా చదవండి: Fact Check: ఎంఎస్ ధోని పేరిట రూ.7 నాణెం విడుదల అవుతుందా? ఇందులో నిజమెంత?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి