డయాబెటిస్ రోగులకు ఈ ఒక్క పని.. అమృతంతో సమానం.!

18 November 2024

Ravi Kiran

ప్రస్తుత కాలంలో డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ మధుమేహం బారిన పడుతున్నారు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే.. రక్తంలో చక్కెర స్థాయి అమాంతం పెరిగి ప్రాణాంతకంగా మారుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో డయాబెటిస్ బాధితులు..రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడే ఆహారాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. 

అలాగే ఈ డయాబెటిస్ రోగులు ఉదయాన్ని అల్పాహారం తీసుకోవడం మరీ ముఖ్యమని డాక్టర్లు చెబుతున్నారు. అలా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు. 

మధుమేహం ఉన్నవారు ఉదయం అల్పాహారం మానేయడం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉదయం ఏమీ తినకుండా మధ్యాహ్నం, రాత్రి మాత్రమే భోజనం చేయడం మంచిది కాదని చెబుతున్నారు. 

ఉదయం ఏమీ తినకుండా మధ్యాహ్నం, రాత్రి మాత్రమే భోజనం చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు భారీగా పెరుగుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. 

దీంతో పాటు అధిక HbA1C, ఇన్సులిన్ ప్రతిస్పందన బలహీనపడటం వంటివి జరుగుతాయన్నారు, కాబట్టి అల్పాహారం మానేయొద్దని సూచించారు.