Chikungunya Vaccine: ఇకపై నో టెన్షన్.. చికున్ గున్యాకు ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చిందోచ్!
చికున్ గున్యా ఈ పేరుకు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకానొక టైమ్ లో ఒక ఊపు ఊపేసింది. ప్రతి ఏటా కొన్ని లక్షల మంది దీని బారిన పడుతూనే ఉంటున్నారు. ఈ వైరస్ సోకిందంటే మనిషి మనిషిలా ఉండడు. తీవ్రంగా జ్వరం, కీళ్ల నొప్పులతో సతమతమవుతూ ఉంటారు. ముఖ్యంగా ఒళ్లంతా నొప్పులతో తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. చికున్ గున్యా సోకిన వ్యక్తికి మరో వ్యక్తి సహాయం ఉంటేనే లేవడానికి..

చికున్ గున్యా ఈ పేరుకు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకానొక టైమ్ లో ఒక ఊపు ఊపేసింది. ప్రతి ఏటా కొన్ని లక్షల మంది దీని బారిన పడుతూనే ఉంటున్నారు. ఈ వైరస్ సోకిందంటే మనిషి మనిషిలా ఉండడు. తీవ్రంగా జ్వరం, కీళ్ల నొప్పులతో సతమతమవుతూ ఉంటారు. ముఖ్యంగా ఒళ్లంతా నొప్పులతో తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. చికున్ గున్యా సోకిన వ్యక్తికి మరో వ్యక్తి సహాయం ఉంటేనే లేవడానికి కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఓ మంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఇక పై దీని బారిన పడిన రోగులకు ఊరట లభించనుంది. ప్రపంచంలోనే మొట్ట మొదటి సారి చికెన్ గున్యా వైరస్ కు టీకాను అమెరికా ఆరోగ్య అధికారులు ఆమోదించారు. ట్రయల్స్ లో ఈ వ్యాక్సిన్ మంచి ఫలితాలను చూపించినట్లు వెల్లడించారు.
లిక్స్ చిక్ పేరుతో మార్కెట్లోకి చికున్ గున్యా వ్యాక్సిన్:
ప్రస్తుతం లిక్స్ చిక్ పేరుతో మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ఈ టికాను ఐరోపాకు చెందిన వాల్నేవా అభివృద్ధి చేసింది. 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారు ఈ టీకాను వేసుకోవాలని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. చికెన్ గున్యా ఎక్కువగా ప్రబలుతున్న ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు యూఎస్ డ్రగ్ రెగ్యులేటర్ తెలిపింది. ఈ వైరస్ ప్రస్తుతం ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికా, అమెరికాలోని ఉష్ణ మండల, ఉప ఉష్ణ మండల ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపిస్తుంది.
రెండు వ్యాక్సిన్లుగా చికున్ గున్యా వ్యాక్సిన్:
గత 15 సంవత్సరాల్లో 5 మిలియన్ లకు పైగా రోగులు ఈ చికున్ గున్యా బారిన పడుతున్నారని తెలిపింది. ఈ వ్యాధి.. దీర్ఘకాలికంగా కూడా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. వృద్ధుల్లో ఈ అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ఓ సీనియర్ ఎఫ్ డీఏ అధికారి ప్రకటనలో వెల్లడించారు. టీకా ఒక మోతాదులో ఇంజెక్ట్ చేయనున్నారు. ఇతర వ్యాక్సిన్ల మాదిరిగానే చికెన్ గున్యాకు రెండు వెర్షన్ లు ఉన్నాయి. బలహీనంగా ఉన్నప్పుడు ఒక వ్యాక్సిన్, తీవ్రంగా ఉన్నప్పుడు మరో వ్యాక్సిన్ ఉంటుంది.
మరింత లోతుగా క్లీనికల్ ట్రయల్స్:
అయితే ముందు ఈ వ్యాక్సిన్ ని దాదాపు 4 వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. అయితే ఈ వ్యాక్సిన్ వల్ల తల నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు అలసట, జ్వరం, వికారం వంటి సాధారణ దుష్ఫ్రభావాలు వెలుగు చూశాయని చెప్పారు. దీనిపై మరింత లోతుగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, త్వరలోనూ పూర్తి స్థాయిలో చికున్ గున్యా వైరస్ అందుబాటులోకి తీసుకు రానున్నారు.
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.







