Vitamins For Eyes: కంటి చూపు మందగిస్తోందా.. మీరు తినే ఆహారంలో ఏ విటమిన్ లోపిస్తోందో ఇలా సింపుల్ గా తెలుసుకోండి..
Vitamin Deficiency: సర్వేంద్రియానాం నయనం ప్రధానం.. కళ్ళు అనేవి మనకు దేవుడిచ్చిన అపురూపమైన నిధి. వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మన విధి. కానీ చాలా మంది మహిళలు కళ్ళను అశ్రద్ధ వహించాలి. ఈ సమస్యకు ప్రధాన కారణం విటమిన్ లోపం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ విటమిన్లు ఏంటో ఇక్కడ చూద్దాం..
విటమిన్లు మనను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయం చేస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధులతో పోరాడటానికి, మన శరీరానికి వివిధ విటమిన్లు, ఖనిజాలు అవసరం. అయితే, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పటికీ, మన శరీరంలో కొన్నిసార్లు పోషకాల లోపం ఏర్పడుతుంది. కొన్ని విటమిన్ల లోపం వల్ల చూపు మందగిస్తుంటుంది. రాత్రిపూట చూడటంలో సమస్యలను ఎదుర్కొంటారు. అంటే వారి కంటి చూపు బలహీనపడిందని అర్థం. వృద్ధాప్యంలో ఎవరికైనా ఇలా జరిగితే, అది పెరుగుతున్న వయస్సుకు సంకేతం కావచ్చు, కానీ యువకులు లేదా మధ్య వయస్కులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే.. వారి శరీరంలో కొన్ని ముఖ్యమైన పోషకాల కొరత ఉందని అర్థం. సాధారణంగా 3 విటమిన్లు లేకపోవడం వల్ల కంటిచూపు బలహీనపడుతుందని భారతదేశపు ప్రముఖ పోషకాహార నిపుణులు అంటున్నారు. మన శరీరంలోని వివిధ లోపాల గురించి చెప్పే సంకేతాల ఏంటో మనం తెలుసుకుందాం..
రోజువారీ ఫుడ్ మెనూలో ఈ విటమిన్లను చేర్చండి..
1. విటమిన్ ఎ
సంపూర్ణ దృష్టిని కలిగి ఉండాలంటే.. వైద్యులు తరచుగా విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాన్ని కలిగి ఉండాలని సూచిస్తారు. మన శరీరంలో చాలా ముఖ్యమైనది ఇది. ఎందుకంటే చీకట్లో చూడడానికి సహాయపడే రోడాప్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి విటమిన్ ఎ పని చేస్తుంది. అందువల్ల, విటమిన్ ఎ లోపం రాత్రి అంధత్వానికి దారితీస్తుంది. ఈ విటమిన్ లోపంతో కళ్ళ బయటి పొరకు రక్షణను కోల్పోతుంది. విటమిన్ ఏ లోపంతో రాత్రి సమయంలో ఏదీ సరిగ్గా కనిపించదు. దీని కోసం మీరు ఆకు కూరలు, బత్తాయి, బొప్పాయి, క్యారెట్, గుమ్మడికాయ తింటే మంచింది.
2. విటమిన్ బి
మీ కంటి చూపు ఎప్పటికీ బలహీనంగా ఉండకూడదనుకుంటే.. విటమిన్ బి6, విటమిన్ బి9 , విటమిన్ బి12 లోపం లేని ఆహారాన్ని తినండి. ఇందుకోసం ఆకు కూరలు, డ్రై ఫ్రూట్స్, పప్పులు, బీన్స్, మాంసం, గింజలు, పాల ఉత్పత్తులు తీసుకోవాలి.
3. విటమిన్ “సి” విటమిన్
విటమిన్ “సి” కూడా కంటి చూపును మెరుగుపరచడానికి సమర్థవంతమైన పోషకంగా పరిగణించబడుతుంది. ఇది కంటి సైట్‌ను మెరుగుపరుస్తుంది. అస్పష్టమైన దృష్టి సమస్యను తొలగిస్తుంది. మీరు నారింజ, నిమ్మ, ఉసిరి, మొసాంబి, జామ, బ్రోకలీ, నల్ల మిరియాలు తీసుకుంటే ఈ పోషకాన్ని వీటిలో లభిస్తాయి.
4. విటమిన్ ఇ
విటమిన్”E” మన శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్ ప్రమాదం నుంచి మనలను రక్షిస్తుంది. దీన్ని సాధించడానికి.. మీరు ఆకుకూరలు, సాల్మన్ చేపలు, నట్స్, అవకాడో తినాలి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం