Lemons and Chillies: గుమ్మానికి నిమ్మకాయ, మిరపకాయలను వేలాడదీయడంలో సైన్స్ ఉంది.. ఆ రహస్యం ఏంటో తెలిస్తే షాకవుతారు..
మనం ఇళ్లకు గుమ్మానికి, వాహనాలకు ముందు నిమ్మకాయ, మిరపకాయ కట్టి వేలాడదీయడం చూసి ఉంటాం. చాలామంది ఇలాంటి ఆచారాన్ని కొన్ని వందల సంవత్సరాలుగా పాటిస్తుంటారు. ఎందుకు ఇలా చేస్తారో చాలామందికి తెలియదు. అయితే దీని వెనుక ఓ సైంటిఫిక్ రహస్యం దాగి ఉంది..
సంస్కృతి, సంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లు. అంతేకాదు సంస్కృతి, సంప్రదాయాలతోపాటు ఆచారాలకు కూడా పెద్ద పీఠ వేస్తుంటారు ఇక్కడి ప్రజలు. కొన్ని ఆచారాలు మాత్రం దేశమంతటా ఒకేలా ఉంటాయి. కొన్ని తెలిసి ఉండొచ్చు.. కొన్ని తెలియకపోవచ్చు. ఇలా ఒకరు పాటించారంటే.. వారి తర్వాత మరొకరు అనుసరిస్తుంటారు. చాలా మంది తమ ఇళ్లు, దుకాణాల తలుపుల వెలుపల, వాహనాలకు ముందు నిమ్మకాయలను వేలాడదీస్తారు. దృష్టి దోశం రాకుండా ఉండేందుకు అని అంటారు. అయితే ఇక్కడి ఆచార(Rituals) వ్యవహరాల వంటివి ఇతర దేశాల్లో కూడా చాలా ఉన్నాయి. కానీ అవేంటో మరోసారి తెలుసుకుందాం.. అయితే ఇప్పడు మన దేశంలోని ప్రజలు నిత్యం అనుసరించే కొన్ని ఆచార వ్యవహరాలు..వాటి వెనుక దాగివున్న సైంటిఫిక్ రహస్యలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే వీటి వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా? అంటే చాలా మంది తెలియదని చెప్పేస్తారు. చాలా మంది ప్రజలు తమ ఇళ్లు , దుకాణాల వెలుపల ఇలాంటివి వేలాడదీయడం మీరు తప్పక చూసి ఉంటారు. ప్రధానంగా ప్రతి శనివారం వీటిని మార్చుతుంటారు. చాలా మంది తమ వాహనాలకు కూడా వేలాడదీస్తున్నారు. కొంతమంది దీనిని మూఢనమ్మకంగా భావిస్తారు. నిమ్మకాయను వేలాడదీయడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాదని, ఇంటిపై ఎవరి కన్ను పడదని చాలా మంది నమ్మకం. కానీ సిట్రోనెల్లాను ఆరుబయట వేలాడదీయడానికి ఓ మంచి శాస్త్రీయ కారణం కూడా ఉంది.
చెడు దృష్టి నుంచి రక్షణ..
నిమ్మకాయలు, మిరపకాయలను ఇళ్ళు, దుకాణాల వెలుపల వేలాడదీయడం వల్ల అశుభం రాదు. ఇది చెడు దృష్టి నుంచి రక్షిస్తుంది. నిమ్మకాయ-మిరపకాయను వేలాడదీయడం వల్ల మీ సంపద నుంచి ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుంది.షాపులో వేలాడదీస్తే వ్యాపారం పెరుగుతుంది. దీని వెనుక ఓ మంచి సైన్స్ దాగి ఉందనేది మాత్రం నిజం. నిమ్మకాయలోని పులుపు, మిరపకాయలు కారం కంటి చూపు ప్రభావాన్ని తగ్గిస్తాయి.
దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి?
ఇళ్లు లేదా దుకాణాల ముందు నిమ్మకాయ-మిరపకాయలను వేలాడదీయడం వెనుక కూడా ఓ మంచి సైన్స్ దాగి ఉంది. నిజానికి మిరపకాయ, నిమ్మకాయ లాంటివి కళ్లముందు కనిపిస్తేనే దాని రుచి మన మనసులో మొదట మెదులుతుంది. దీని కారణంగా, మనం దానిని ఎక్కువసేపు చూడలేం.. వెంటనే మన దృష్టిని దాని నుంచి మళ్లించుకుంటాం.
అంతే కాదు మరోకారణం కూడా ఉంది. అందేంటంటే.. సాయంత్రం అయ్యిందంటే చాలు ఇళ్లలోకి దోమలు, లైట్ పురుగులు వచ్చి చేరుతుంటాయి. ఇప్పుడంటే దోమల నుంచి తప్పించుకోవడానికి మస్కిటో కాయిల్స్, ఎన్నో రకాల కెమికల్స్ వాడుతున్నాం.. అయితే అప్పట్లో ఇలాంటి కెమికల్స్ లేవు.. తెలిసిన కెమికల్స్ వాడేవారు కాదు..
దీంతో.. నిమ్మకాయ, మిరపకాయలు కలిపి ఇంట్లో గుమ్మానికో.. లేదంటే దూలానికో కట్టేవారు. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ దోమలు, ఈగలు, ఇతర కీటకాలు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. నిమ్మకాయను దారానికి కట్టి గుచ్చడం వల్ల నిమ్మకాయలోని సిట్రస్ యాసిడ్ వాసన బయటకు వస్తూ పురుగులు రాకుండా అడ్డుకునేది. మిరపకాయలోని ఘాటు కూడా పురుగులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
ఇది ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది
అలాగే, శాస్త్రీయ దృక్కోణంలో, నిమ్మకాయలు చాలా పుల్లగా ఉంటాయి. మిరపకాయలు చాలా వేడిగా ఉంటాయి. మీరు దానిని ఏదైనా తలుపు మీద వేలాడదీస్తే, దాని ఘాటైన వాసన ఇంట్లోకి ఈగలు, కీటకాలు రాకుండా చేస్తుంది. అందువల్ల, చుట్టుపక్కల వాతావరణం కూడా శుద్ధి చేయబడుతుంది. ఇంటి బయట వేలాడదీయడం కూడా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ప్లాస్టిక్ నిమ్మకాయ-మిరపకాయలను వేలాడదీయవద్దు!
ఈ రోజుల్లో ప్లాస్టిక్‌తో చేసిన నిమ్మకాయలు కూడా మార్కెట్‌లో లభిస్తున్నాయి. చాలా మంది వాటిని తమ ఇళ్లలో, దుకాణాల్లో వేలాడదీస్తారు. దాని వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే దీని నుండి వాసన ఉండదు. వాస్తు ప్రకారం ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇంట్లో ఎప్పుడూ తాజా నిమ్మకాయ, మిరపకాయలను వాడండి. వాటిని ప్రతిరోజూ మార్చండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం