AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Glass in Lift: లిఫ్ట్‌లోని అద్దం ముఖం చూసుకోవడానికి కాదు.. అసలు కారణం మరొకటి ఉంది.. అదేంటంటే..

Mirror Installed In Lift: అందరికి తెలిసింది.. కేవలం మనం మన ప్రతిబింబం చూసుకునేందుకు అని అనుకుంటారు. కాని అందులో ఓ సైన్స్, ఓ లాజిక్ దాగి వుంది.  

Glass in Lift: లిఫ్ట్‌లోని అద్దం ముఖం చూసుకోవడానికి కాదు.. అసలు కారణం మరొకటి ఉంది.. అదేంటంటే..
Mirror Installed In Lift
Sanjay Kasula
|

Updated on: Sep 15, 2022 | 1:51 PM

Share

సైన్స్‌ అభివృద్ధి వల్ల మనిషికి ఎన్నో పనులు చాలా సులువుగా మారాయి. నేటి ఆధునిక యుగంలో దాదాపు ప్రతిదీ సాంకేతికత కారణంగా అభివృద్ధి వైపు పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. అటువంటి గొప్ప ఆవిష్కరణలలో ఒకటి ఎలివేటర్. ఎలివేటర్ సహాయంతో ఎత్తైన భవనానికి వెళ్లడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు.. లేదా ఎక్కువ సమయం వృథా చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇదే ఎలివేటర్‌లో మన ప్రతిబింబం కనిపించేందుకు ఓ అద్దంను ఏర్పాటు చేస్తారు. అయితే ఆ అద్దం ఎందుకు ఏర్పాటు చేస్తారో చాలా మందికి తెలియదు. అందరికి తెలిసింది.. కేవలం మనం మన ప్రతిబింబం చూసుకునేందుకు అని అనుకుంటారు. కాని అందులో ఓ సైన్స్, ఓ లాజిక్ దాగి వుంది.

అది ఆఫీసు అయినా, మాల్ అయినా లేదా మరేదైనా ఎత్తైన భవనం అయినా.. చాలా చోట్ల ఎలివేటర్లు అమర్చబడి ఉంటాయి. మీరు మీ రోజువారీ జీవితంలో కూడా దీనిని ఉపయోగిస్తూ ఉండవచ్చు. లిఫ్ట్‌లో అద్దాల ఏర్పాటును కొంతకాలం క్రితం ప్రారంభించారు. మీరు అనేక ఎలివేటర్లలో అద్దాలను కూడా గమనించి ఉండవచ్చు. అయితే దీని వెనుక కారణం ఏంటో తెలుసుకుందాం.

ఎలివేటర్లలో అద్దానికి కారణం ఇదే..?

మనం ఎలివేటర్‌ను ఉపయోగించినప్పుడు.. అది వేగం ఉందని చాలా మంది భావిస్తారు. దీంతో వారు కొంత ఆందోళనకు గురవుతారు. ఒకటవ అంతస్తు నుంచి నాలుగు, ఐదు.. ఇలా ఆపై అంతస్తుకు ఎలివేటర్ క్షణాల్లో చేరుకుంటుంది. ఆ సమయంలో చాలా మంది తమకు కళ్లు తిరుగుతున్నాయని, తమకు అదోలా ఉంటుందనే ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు.. ఇలా ఎలివేటర్ వినియోగదారులను ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని.. దృష్టి ఎలివేటర్ గోడల వైపు ఉందని, అందువల్ల వారు లిఫ్ట్ వేగాన్ని తట్టుకునేందుకు, ఆందోళన చెందకుండా ఉండేదుకని తేలింది. దీని తరువాత, ఎలివేటర్ తయారీదారులు ఈ సమస్యను పరిష్కరించడానికి ఎలివేటర్ గోడలపై అద్దాలను ఇన్స్టాల్ చేయడం ప్రారంభించారు.

చాలా మంది అపోహ..

ఎలివేటర్లలో అద్దాలు ముఖం చూడడానికి అని అపోహ కలిగి ఉంటారు. అయితే, అద్దం అమర్చిన తర్వాత అందరి దృష్టిని ఒప్పించే అద్దం వైపు మళ్లడం ప్రారంభమైంది. అందుకే ఎలివేటర్లలో అద్దాలను ఉపయోగిస్తారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం