AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: స్నానం చేసిన వెంటనే ఈ పని చేస్తున్నారా? భారీగా బరువు పెరుగుతారు జాగ్రత్త..

Health Tips: ప్రస్తుత బిజీ లైఫ్‌లో నిద్ర నుంచి లేవడమే ఆలస్యం.. ఉద్యోగానికి వెళ్లేందుకు సిద్ధం అవడం, హడావిడిగా వంట చేయడం, స్నానం చేయడం అన్నీ..

Health Tips: స్నానం చేసిన వెంటనే ఈ పని చేస్తున్నారా? భారీగా బరువు పెరుగుతారు జాగ్రత్త..
Health
Shiva Prajapati
|

Updated on: Sep 15, 2022 | 7:10 AM

Share

Health Tips: ప్రస్తుత బిజీ లైఫ్‌లో నిద్ర నుంచి లేవడమే ఆలస్యం.. ఉద్యోగానికి వెళ్లేందుకు సిద్ధం అవడం, హడావిడిగా వంట చేయడం, స్నానం చేయడం అన్నీ చకచకా చేసేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో చాలా మంది ఆఫీస్‌కు లేట్ అవుతుందనే ఉద్దేశ్యంతో.. స్నానం చేసిన వెంటనే భోజనం, టిఫిన్ చేస్తుంటారు. కానీ, అలా స్నానం చేసిన వెంటనే భోజనం, టిఫిన్ చేయొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. బరువు పెరగడానికి, ఊబకాయానికి దారి తీస్తుంది. స్నానం చేసిన వెంటనే తింటే ఏం జరుగుతోంది ఇప్పుడు తెలుసుకుందాం..

1. స్నానం చేసిన వెంటనే భోజనం చేస్తే ఎసిడిటీ, గుండెల్లో మంట, అసౌకర్యం, గ్యాస్ట్రిక్ సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్నానం చేసిన వెంటనే తినడం వల్ల జీర్ణక్రియ ఆలస్యం అవుతుంది. కడుపు చుట్టూ ఉన్న రక్తం శరీరంలోని ఇతర భాగాలకు ప్రవహించడం జరుగుతుంది.

2. రోజువారీ కార్యకలాపాలకు నిర్దిష్ట సమయాలను షెడ్యూల్ చేయాలి. ప్రతిరోజూ ఒకే సమయంలో భోజనం చేయాలి. అలాకాకుండా సమయపాలన లేకుండా తినడం వలన మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

3. ఆహారం కడుపులోకి వెళ్లినప్పుడు శరీరం చల్లబడుతుంది. ఇది అసౌకర్యం, ఆమ్లత్వాన్ని పెంచుతుంది. దీర్ఘకాలంలో జీర్ణ సమస్యలు, బరువు పెరుగుట, ఊబకాయం వంటి సమస్యలకు దారి తీస్తుంది.

4. స్నానం చేసిన తర్వాత తినడానికి, స్నానానికి ముందు తినడానికి కనీసం 2-3 గంటలు వేచి ఉండాలని వైద్యులు అంటున్నారు. ఉదయం గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మంచిదని చెబుతున్నారు నిపుణులు. సమయాభావం కారణంగా ప్రతిదీ హడావిడిగా ఉన్నప్పుడు.. స్నానానికి ఎక్కువ సమయం ఇవ్వడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజూ ఏదైనా తినే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలని సూచిస్తున్నారు.

5. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరాన్ని ఉత్తేజపరిచే హైపర్‌థెర్మిక్ రియాక్షన్ ప్రక్రియ పెరుగుతుంది. వెచ్చని షవర్ నాడీ వ్యవస్థను సడలిస్తుంది. రోగనిరోధక, జీర్ణ వ్యవస్థలను ప్రేరేపిస్తుంది. ఇది టాక్సిన్స్‌ని బయటకు పంపి, జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
బాత్రూంలో ఈ చిన్న వస్తువును పెట్టండి.. సంపద పెరుగుతుంది
బాత్రూంలో ఈ చిన్న వస్తువును పెట్టండి.. సంపద పెరుగుతుంది
అకస్మాత్తుగా ముఖాముఖి ఎదురుపడ్డ ప్రధాని మోదీ , రాహుల్ గాంధీ..!
అకస్మాత్తుగా ముఖాముఖి ఎదురుపడ్డ ప్రధాని మోదీ , రాహుల్ గాంధీ..!
టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు
టాస్ ఓడిన హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు
ఇంటి గుమ్మం వద్ద ఆవు నిలబడితే ఏం జరుగుతుందో తెలుసా?
ఇంటి గుమ్మం వద్ద ఆవు నిలబడితే ఏం జరుగుతుందో తెలుసా?
సేఫ్టీ పిన్ వెనుక ఈ రంధ్రం కనిపెట్టి.. బిలియన్ డాలర్ల సామ్రాజ్యం!
సేఫ్టీ పిన్ వెనుక ఈ రంధ్రం కనిపెట్టి.. బిలియన్ డాలర్ల సామ్రాజ్యం!
రానున్న అమావాస్యతో ఈ రాశుల వారి జీవితాల్లో వెలుగులు నిండటం ఖాయం
రానున్న అమావాస్యతో ఈ రాశుల వారి జీవితాల్లో వెలుగులు నిండటం ఖాయం
Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా..
Krishna Vamsi: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్ర మిస్సైన హీరో ఎవరో తెలుసా..